బుధవారం 25 నవంబర్ 2020
Rajanna-siricilla - Nov 01, 2020 , 01:17:55

శ్రీవారిని దర్శించుకున్న నర్సింగరావు

శ్రీవారిని దర్శించుకున్న నర్సింగరావు

సిరిసిల్ల టౌన్‌: సిరిసిల్ల శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శనివారం ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో నాగారపు శ్రీనివాస్‌ నర్సింగరావును శాలువాతో సత్కరించి స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఉప్పల విఠల్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, బుర్ర నారాయణగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.