గురువారం 26 నవంబర్ 2020
Rajanna-siricilla - Oct 31, 2020 , 01:11:16

అన్నదాత ఆత్మగౌరవానికి ప్రతీక రైతువేదిక

అన్నదాత ఆత్మగౌరవానికి ప్రతీక రైతువేదిక

సిరిసిల్ల రూరల్‌: అన్నదాతల ఆత్మగౌరవానికి ప్రతీకగా ప్రభుత్వం రైతు వేదికలు నిర్మిస్తున్నదని రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్‌ గడ్డం నర్సయ్య పేర్కొన్నారు. శుక్రవారం సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని చంద్రంపేటలో రైతు వేదిక నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతు వేదికల నిర్మాణం జిల్లాలో శరవేగంగా జరుగుతున్నదని తెలిపారు. రైతును రాజు చేయడం కోసం సీఎం కేసీఆర్‌ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ, సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, యంత్రాలు అందిస్తూ అండగా నిలుస్తున్నారని గుర్తుచేశారు. రైతుల సంఘటితం కోసం రైతు వేదికలు దోహదపడుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు రైతుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట నాయకులు, అధికారులు ఉన్నారు.