గురువారం 03 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Oct 31, 2020 , 01:09:13

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ

పలు గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

ఎల్లారెడ్డిపేట: తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నదని జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ స్పష్టంచేశారు. శుక్రవారం హరిదాస్‌నగర్‌, రాగట్లపల్లి, వెంకటాపూర్‌లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను పీఏసీఎస్‌ చైర్మన్‌ గుండారపు కృష్ణారెడ్డి, ఎంపీపీ పిల్లి రేణుక, జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావుతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం, పథకం రైతుల మేలుకోరేలా ఉన్నాయని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు, రైతుబీమా, తదితర పథకాలను అమలు చేస్తున్నదని కొనియాడారు. రైతుకు ఇబ్బంది లేకుండా ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేస్తామని తెలిపారు. ఇందులో సెస్‌ డైరెక్టర్‌ కుంబాల మల్లారెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ గుళ్లపల్లి నర్సింహారెడ్డి, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ జంగిటి సత్తయ్య, సర్పంచులు కోల అంజవ్వ, దాసరి సుజాత, తెడ్డు అమృత, ఎంపీటీసీలు ఉప్పుల మల్లేశం, మామిండ్ల తిరుపతిబాబు, కదిరె భాస్కర్‌, నాయకులు అందె సుభాష్‌, ఎలుసాని మోహన్‌, కొండ రమేశ్‌, జబ్బార్‌, ఏపీఎం మల్లేశం, పిల్లి కిషన్‌, దాసరి మహేందర్‌, కోల నర్సయ్య ఉన్నారు. 

ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం

వేములవాడ రూరల్‌: రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ పేర్కొన్నారు. శుక్రవారం వేములవాడ మున్సిపల్‌ పరిధిలోని బాల్‌నగర్‌, మండలంలోని వట్టెంల గ్రామంలో వేములవాడ పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్‌ చైర్మన్‌ ఏనుగు తిరుపతిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ, రైతుల సౌకర్యం కోసం ప్రభుత్వం ప్రతి గ్రామానికి ఒక కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని  సూచించారు. కార్యక్రమంలో వేములవాడ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డం హన్మాండ్లు, జడ్పీటీసీ ఏశ వాణి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మధురాజేందర్‌, డీఎస్వో జితేందర్‌రెడ్డి, డీసీవో బుద్ధినాయుడు, సీఈవో లక్ష్మణ్‌, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ తూం కాంతారావు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు ఏశ తిరుపతి, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు పుల్కం రాజు, సర్పంచ్‌ యామ సుమతి, ఉప సర్పంచ్‌ మల్లేశం, కౌన్సిలర్లు కవిత, మహేశ్‌, కుమార్‌, డైరెక్టర్లు తోట రాజు, దొంతగోని రాజయ్య, సురేందర్‌రెడ్డి,  నాయకులు శ్రీనివాస్‌, పరశురాములు, తిరుపతి, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.