మంగళవారం 24 నవంబర్ 2020
Rajanna-siricilla - Oct 30, 2020 , 05:35:58

నిరుపేదలకు వరం సీఎంఆర్‌ఎఫ్‌

నిరుపేదలకు వరం సీఎంఆర్‌ఎఫ్‌

రుద్రంగి: సీఎం సహాయనిధి నిరుపేదలకు వరమని ఎంపీపీ గంగం స్వరూపారాణి, జడ్పీటీసీ గట్ల మీనయ్య అన్నారు. సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా మండల కేంద్రానికి చెందిన అల్లూరి రాజిరెడ్డికి రూ.13,500, శెట్టి లక్ష్మణ్‌కు రూ.18 వేల విలువైన చెక్కులు మంజూరు కాగా, స్థానిక టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో పార్టీ గ్రామాధ్యక్షుడు దయ్యాల కమలాకర్‌ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేశారు. ఆర్థిక సాయం మంజూరు చేయించిన ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్‌పర్సన్‌ ఆకుల భూమక్క, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ నారాయణ, నాయకులు మాడిశెట్టి ఆనందం, గంగం మహేశ్‌, అంబటి గంగాధర్‌, చెప్యాల సంజీవ్‌, మంచె రాజేశం, చెప్యాల గణేశ్‌, పిడుగు లచ్చిరెడ్డి, కాదాసు లక్ష్మణ్‌, కర్ణవత్తుల దేవేందర్‌, కంటె రెడ్డి, అల్లూరి లచ్చిరెడ్డి, మరిగడ్డ సతీశ్‌, ఉప్పులూటి గణేశ్‌, తలారి నర్సయ్య, దాసరి గంగారాజం, పూదరి శ్రీనివాస్‌, మహిళలు పాల్గొన్నారు.