బుధవారం 02 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Oct 30, 2020 , 05:35:58

‘ధరణి’తో వేగంగా రిజిస్ట్రేషన్లు

‘ధరణి’తో వేగంగా రిజిస్ట్రేషన్లు

  • భూ క్రయవిక్రయాల్లో తొలగనున్న ఇబ్బందులు
  • పోర్టల్‌ ప్రారంభోత్సవంలో ప్రజాప్రతినిధులు, నాయకులు

వేములవాడ రూరల్‌: ధరణి పోర్టల్‌ ప్రారంభంతో భూముల రిజిస్ట్రేషన్లు వేగంగా జరుగుతాయని వేములవాడ కమిటీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డం హన్మాండ్లు, ఎంపీపీ బూర వజ్రమ్మ, జడ్పీటీసీ మ్యాకల రవి పేర్కొన్నారు. గురువారం వేములవాడ తహసీల్దార్‌ కార్యాలయంలో ధరణి ప్రారంభోత్సవంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ధరణితో రైతులకు భూ క్రయవిక్రయాల్లో ఇబ్బందులు తొలగనున్నాయని, రిజిస్ట్రేషన్‌ చేసిన వెంటనే పాస్‌బుక్‌ పొందవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ మునీందర్‌, రుద్రవరం సింగిల్‌ విండో చైర్మన్‌ రేగులపాటి కృష్ణదేవరావు, సర్పంచ్‌ వెంకటరమణ, ఎంపీటీసీ దేవరాజు, నాయకులు జింక వేణు, రంగు రాములు తదితరులు పాల్గొన్నారు.

చందుర్తి: మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో గురువారం ధరణి పోర్టల్‌ను ఎంపీపీ బైరగోని లావణ్య ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ లావణ్య, తహసీల్దార్‌ నరేశ్‌ మాట్లాడుతూ, ధరణితో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌తోపాటు మ్యుటేషన్‌ వేగంగా పూర్తవుతుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పొన్నాల శ్రీనివాస్‌రావు, ప్యాక్స్‌ చైర్మన్‌ తిప్పని శ్రీనివాస్‌, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

రుద్రంగి: మండల కేంద్రంలో తహసీల్దార్‌ కార్యాలయంలో గురువారం ధరణి పోర్టల్‌ను ఎంపీపీ గంగం స్వరూపారాణి, జడ్పీటీసీ గట్ల మీనయ్య తహసీల్దార్‌ మహ్మద్‌ తఫాజుల్‌ హుస్సేన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ధరణి పోర్టల్‌ ద్వారా భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ సులభతరం కానుందన్నారు. డీటీ మల్లయ్య, ఆర్‌ఐ సునీత, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ నారాయణ, నాయకులు మాడిశెట్టి ఆనందం, గంగం మహేశ్‌, మంచె రాజేశం, చెప్యాల గణేశ్‌, దయ్యాల కమలాకర్‌, మరిగడ్డ సతీశ్‌, రెవెన్యూ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. 

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

గంభీరావుపేట: ధరణి పోర్టల్‌ ప్రారంభించిన సందర్భంగా మండలంలోని సముద్రలింగాపూర్‌లో పంట పొలాల వద్ద రైతులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మోతె రాజిరెడ్డి, రైతులు మట్ట బాల్‌రెడ్డి, దుబ్బాక మల్లేశం, మట్ట నారాయణరెడ్డి, బాల్‌రెడ్డి, దేవాగౌడ్‌, నారాగౌడ్‌, రాజుగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

బోయినపల్లి: మండల కేంద్రంలో గురువారం సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి టీఆర్‌ఎస్‌ నాయకులు పాలాభిషేకం చేశారు. రెవెన్యూ చట్టాన్ని సవరించి ధరణి పోర్టల్‌ను ప్రారంభించినందుకు బస్టాండ్‌ ఆవరణలో అంబేద్కర్‌ విగ్రహం వద్ద పటాకులు కాల్చి హర్షం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ కొనుకటి నాగయ్య, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ లెంకల సత్యనారాయణరెడ్డి, సర్పంచులు  బూర్గుల నందయ్య, కన్నం మధు, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మేడుదుల మల్లేశం, నాయకులు కత్తెరపాక కొండయ్య, సంబ లక్ష్మీరాజం, గుంటి శంకర్‌, కే రాములు, కొమ్మన బోయిన సువీన్‌యాదవ్‌, ఎడపల్లి బాబు, భీమనాథుని రమేశ్‌, బొజ్జ నరేశ్‌ పాల్గొన్నారు.