సోమవారం 23 నవంబర్ 2020
Rajanna-siricilla - Oct 29, 2020 , 00:20:11

కరోనాపై అప్రమత్తంగా ఉండాలి

కరోనాపై అప్రమత్తంగా ఉండాలి

ఇల్లంతకుంట: కరోనాపై అప్రమత్తంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు అన్నా రు. బుధవారం మండలపరిషత్‌ కార్యాలయంలో  వైద్యసిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చలికాలం లో కరోనా వైరస్‌ వ్యాప్తి జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు అవసరమైతే తప్పా బయటకు రావద్దని పేర్కొన్నారు. ప్రజలు భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని సూచించారు. ప్రతి గ్రామంలో ఆశ కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ఐకేపీ, మహిళా సంఘాల సభ్యులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లా సర్వైవ్‌లెన్స్‌ అధికారి డాక్టర్‌ మీనాక్షి, మండల వైద్యాధికారి సుభాషిణి, రామకృష్ణ తదితరులు ఉన్నారు.