సోమవారం 30 నవంబర్ 2020
Rajanna-siricilla - Oct 29, 2020 , 00:08:57

చట్టాలను గౌరవించాలి

చట్టాలను గౌరవించాలి

దళితుల పై దాడి బాధాకరం 

ఇలాంటి ఘటనలు పునరావృతం  కాకుండా చర్యలు

రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌

ఇల్లంతకుంట : దళితులపై దాడి బాధాకరమని, చ ట్టాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని రామోజీపేటలో బాధిత దళిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులమతాలకతీతంగా కలిసి ఉన్నప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు.   ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కలెక్టర్‌, ఎస్పీ  చర్య లు తీసుకోవాలన్నారు. ఎస్సీ కమిషన్‌ బాధితులకు  అండగా  ఉంటుందన్నారు. 9 మంది బాధి త కుటుంబాలకు రూ. 25 వేల చొప్పున తక్షణ సహాయం కింద చెక్కులను అందజేస్తున్నామని చె ప్పారు. అందుబాటులో ఉన్న పలువురికి చెక్కులు అందజేశారు. రాష్ట్ర ఆహార భద్రత కమిషన్‌ సభ్యుడు ఒరుగంటి ఆనంద్‌,  కలెక్టర్‌ కృష్ణ భాస్కర్‌,   ఎస్పీ రాహూల్‌ హెగ్డే,  డీఎస్పీ చంద్రశేఖర్‌, ఆర్డీవో శ్రీనివాస్‌ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యులు రాంపాల్‌ నాయక్‌, విద్యాసాగర్‌, ఎంపీపీ   వెంకటరమణారెడ్డి, తాసీల్దార్‌ రాజిరెడ్డి  పాల్గొన్నారు.