గురువారం 03 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Oct 28, 2020 , 01:01:18

సీఎంఆర్‌ఎఫ్‌ పేదలకు వరం

సీఎంఆర్‌ఎఫ్‌ పేదలకు వరం

ఇల్లంతకుంట: ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరంలాంటిదని సర్పంచ్‌ గజ్జల సుదర్శన్‌ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా దాచారం గ్రామానికి చెందిన మారవేని మహేందర్‌కు 12వేలు, రగుడ చంద్రయ్యకు 12వేల విలువైన చెక్కులను అందజేశారు. చెక్కులు మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ సిద్ధం వేణు, ఎంపీపీ వెంకటరమణారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో ఎంపీటీసి బర్ల తిరుపతి, ఆర్‌బీఎస్‌ కన్వీనర్‌ వాడె సంజీవరెడ్డి, టీఆర్‌ఎస్‌ గ్రామాధ్యక్షుడు దుర్ముట్ల రాజు ఉన్నారు.

వేములవాడ రూరల్‌: వేములవాడ రూరల్‌ మండ లం మర్రిపెల్లికి చెందిన రాచర్ల భవానికి సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా మంజూరైన 20వేల విలువైన చెక్కును వేములవాడ ఏఎంసీ చైర్మన్‌ గడ్డం హన్మాండ్లు లబ్ధిదారుకు అందజేశారు. ఈ సందర్భంగా హన్మాండ్లు మాట్లాడుతూ, నిరుపేదలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రైవేట్‌ దవాఖానల్లో ఖరీదైన వైద్యం చేయించుకున్న ఎంతో మంది పేదలకు ఎమ్మెల్యే రమేశ్‌బాబు సహకారంతో సీఎంఆర్‌ఎఫ్‌ మంజూరు చేశామని తెలిపారు. ఇందులో మాజీ ఎం పీటీసీ గొస్కుల రవి, ఏఎంసీ డైరెక్టర్‌ తిరుపతి, ఉప సర్పంచ్‌ బాలకృష్ణ, ప్రవీణ్‌, సురేశ్‌, నరేశ్‌ తదితరులు ఉన్నారు.