మంగళవారం 01 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Oct 27, 2020 , 05:41:08

నిరుపేదకు చందాలతో దహనసంస్కారాలు

 నిరుపేదకు చందాలతో దహనసంస్కారాలు

 సిరిసిల్ల రూరల్‌: అనారోగ్యంతో మృతిచెందిన ఓ కార్మికుడి అంత్యక్రియలకు దాత లు ముందుకొచ్చి ఆర్థికసాయం అందజేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని రగుడులో అనారోగ్యంతో భవన నిర్మాణ కార్మికుడు గుగ్గిల్ల మల్లికార్జున్‌గౌడ్‌(45) మృతి చెందాడు. ఇతడికి భార్య లావణ్య, ముగ్గురు కూతుర్లు దీపిక, అస్మిత, సుప్రియ, కొడుకు ఉన్నారు. మల్లికార్జున్‌గౌడ్‌ కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. పలు దవాఖానల్లో చూపించగా, అధిక ఖర్చుతో కూడుకున్న చికిత్స అవసరమని వైద్యులు తెలుపడంతో పేదరికంతో చికిత్స చేయించుకోలేకపోయాడు. 

ఆదివారం దసరా పండుగ రోజున తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు. మల్లికార్జున్‌ మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. దహన సంస్కారాలకు కూడా డబ్బులు లేకపోవడంతో పలువురు దాతలు ముందుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. అలాగే సోషల్‌ మీడియాలోనూ స్పందించి, ఆర్థికసాయం ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ నేత గుగ్గిల్ల అజయ్‌గౌడ్‌ రూ.2వేలు, పులి సరోజన రూ.10వేలు, హైదరాబాద్‌కు చెందిన తీగల రాంప్రసాద్‌ రూ.2వేలు, పాటి రాజకుమార్‌, దండు కమలాకర్‌  రూ.వెయ్యి చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. మరింతమంది దాతలు స్పందించి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని రగుడు ప్రజలు కోరుతున్నారు.