మంగళవారం 01 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Oct 25, 2020 , 04:38:24

బట్టల దుకాణ యజమాని బలవన్మరణం

బట్టల దుకాణ యజమాని బలవన్మరణం

 సిరిసిల్లలో విషాదం

సిరిసిల్ల క్రైం: అప్పుల బాధతో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఓ బట్టల దుకాణ యజమాని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతనగర్‌కు చెందిన యువకుడు గాజుల జనార్దన్‌(32) బట్టల వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం రూ. 10లక్షల అప్పు చేసి సిరిసిల్లలోని పత్తిపాక వీధిలో  రెడిమెడ్‌ దుస్తుల దుకాణం పెట్టాడు. కొద్దిరోజులుగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సిరిసిల్లలోని బైపాస్‌ రోడ్‌ సమీపంలోని చెట్ల పొదల్లో ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని గుర్తించారు. కుటుంబసభ్యులకు రోదనలు మిన్నంటాయి. జనార్దన్‌కు భార్య లావణ్య ఉంది. తండ్రి దేవయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, విచారణ చేస్తున్నామని సీఐ వెంకటనర్సయ్య తెలిపారు.