ఆదివారం 29 నవంబర్ 2020
Rajanna-siricilla - Oct 24, 2020 , 02:07:11

ఆడబిడ్డలకు వరం కల్యాణలక్ష్మి

ఆడబిడ్డలకు వరం కల్యాణలక్ష్మి

ఏఎంసీ చైర్మన్‌ హన్మాండ్లు 

54 మందికి కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేత

వేములవాడ రూరల్‌: కల్యాణ లక్ష్మి పథకం నిరుపేద ఆడబిడ్డలకు వరమని వేములవాడ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డం హన్మాండ్లు పేర్కొన్నారు. వేములవాడ రూరల్‌ మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ఆయన 54 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు సహకారంతో లబ్ధిదారులకు చెక్కులు మంజూరైనట్లు చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు చేరాయని గుర్తుచేశారు. ఇందులో తహసీల్దార్‌ నక్క శ్రీనివాస్‌, ఎంపీపీ బండ మల్లేశం, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు ఏశ తిరుపతి, ఎంపీటీసీ మల్లారం తిరుపతి, సర్పంచ్‌ పెండ్యాల తిరుపతి, తూం లక్ష్మి, నాయకులు బొడ్డు రాములు, బాల్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.