సోమవారం 30 నవంబర్ 2020
Rajanna-siricilla - Oct 24, 2020 , 02:07:11

లక్ష్యసాధనకు కృషి చేయాలి

లక్ష్యసాధనకు కృషి చేయాలి

కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌

బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్లకు విద్యార్థుల ఎంపిక

సిరిసిల్ల ఎడ్యుకేషన్‌: విద్యార్థులు చిన్నప్పటి నుంచే లక్ష్యం ఏర్పరచుకొని ఆ దిశగా అడుగులు వేయాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ సూచించారు. బెస్ట్‌ అవైలబుల్‌ స్కుళ్లలో 1వ, 5వ తరగతిలో ప్రవేశాల కోసం శుక్రవారం జిల్లా కేంద్రంలోని పొదుపు భవన్‌లో లాటరీ ద్వారా విద్యార్థులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఐదు బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. 1వ తరగతిలో 18, 5వ తరగతిలో 18 స్వీట్ల భర్తీకి గత సెప్టెంబర్‌లో 69మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. లాటరీ ద్వారా 36విద్యార్థులను మందిని ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఇందులో జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి భాస్కర్‌రెడ్డి, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల జిల్లా కో ఆర్డినేటర్‌ జాక్వెలిన్‌, ఎస్సీ,ఎస్టీ అట్రాసీటి కమిటీ సభ్యుడు నాయిని శంకర్‌ పాల్గొన్నారు.

విద్యార్థికి అభినందన

ఇటీవల విడుదలైన నీట్‌ ప్రవేశ పరీక్షల ఫలితాల్లో జాతీ య స్థాయిలో 7,174 ర్యాంకు సాధించిన వేములవాడ మండలం ఎదురుగట్లకు చెందిన అజయ్‌ని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, జిల్లా గ్రంథాయ చైర్మన్‌ శంకరయ్య జిల్లా కేంద్రంలోని సినారె స్మారక భవన్‌లో శుక్రవారం సత్కరించారు. సరైన ప్రణాళిక ఉంటే భవిష్యత్‌ గొప్పగా ఉంటుందన్నారు. ఇం దులో ఆర్‌బీఎస్‌ జిల్లా కన్వీనర్‌ గడ్డం నర్సయ్య, గ్రంథాలయ డైరెక్టర్లు, తదితరులు ఉన్నారు.