శనివారం 05 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Oct 23, 2020 , 05:11:43

భగీరథ పనులను త్వరగా పూర్తి చేయాలి

భగీరథ పనులను  త్వరగా పూర్తి చేయాలి

చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్‌ 

ఎస్‌వీసీ ప్రాజెక్ట్‌ పరిధిలోని ఇంజినీరింగ్‌ అధికారులతో సమీక్ష 

మల్యాల: మిషన్‌ భగీరథ పనులను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసి బల్క్‌ వాటర్‌ సరఫరా చేయాలని చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్‌ అధికారులను ఆదేశించారు. చొప్పదండిలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి(ఎస్‌వీసీ) ప్రాజెక్ట్‌ పరిధిలోని ఇంజినీరింగ్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆరు మండలాల్లో కొనసాగుతున్న పనులను వెంటనే పూర్తి చేయాలని కోరారు. సీఎం కేసీఆర్‌  సూచనల మేరకు ఇంటింటికీ భగీరథ నీరందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ రవీందర్‌రావు, ఈఈ శేఖర్‌రెడ్డి, విజయ్‌ప్రకాష్‌, మల్యాల జడ్పీ సభ్యుడు కొండపలుకుల రాంమోహన్‌రావు, ఏఈఈలు తదితరులు పాల్గొన్నారు.