శుక్రవారం 27 నవంబర్ 2020
Rajanna-siricilla - Oct 22, 2020 , 02:21:01

ఎములాడలో నేడే సద్దులు

ఎములాడలో నేడే సద్దులు

ముస్తాబైన మూలవాగు

అన్ని ఏర్పాట్లు చేసిన యంత్రాంగం

వేములవాడ కల్చరల్‌: బతుకమ్మ వేడుకలను రా జన్న క్షేత్రం సిద్ధమైంది. వేములవాడలో ఏడురోజులకే సద్దుల నిర్వహించడం ఆనవాయితీ కాగా, నేడు నిర్వహించనున్న వేడుకలకు పురపాలక యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మూలవాగును విద్యుద్దీపాలతో అలంకరించారు. పట్టణంలోని మహిళలు బతుకమ్మ ఆడుకునేందుకు వీలు గా కూడళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బతుకమ్మ తెప్పకు అందంగా రంగులు వేయడంతోపాటు మూలవాగు పరిసర ప్రాంతాలను జేసీబీతో చదు ను చేయించారు.  బతుకమ్మ తెప్పవద్దకు వచ్చేందుకు మహిళలు ఇబ్బందులు పడకుండా సుభాష్‌నగర్‌లో బారికేడ్లను పెట్టారు. దాదాపు రూ.20 లక్షల వ్యయంతో ఎవరికీ ఏ ఇబ్బందులు రా కుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ మట్ట శ్రీనివాస్‌రెడ్డి, చైర్మన్‌ రామతీర్థపు మాధవిరాజు వెల్లడించారు. కాగా, వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు సిటీ కేబుల్‌ ఎండీ కొ క్కుల శ్రీనివాస్‌ తెలిపారు. కాగా, సద్ద్దుల సందర్భంగా వేములవాడలోని మార్కెట్‌ ఏరియా, మె యిన్‌రోడ్‌  రద్దీగా మారింది. ఉదయం నుంచే అటు అమ్మకందారులు, ఇటు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. మంగళవారం నుంచే పూలు అమ్మే వారితో మార్కెట్‌ పరిసరాలు సందడిగా మారగా, బుధవారం రద్దీగా కనిపించాయి.

  ప్రత్యేక బందోబస్తు..

వేడుకల సందర్భంగా ఎక్కడా ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్‌శాఖ బందోబస్తు చేపట్టేందుకు సిద్ధమైంది. డీఎస్పీ చంద్రకాంత్‌ ఆధ్వర్యంలో పట్టణ, రూరల్‌ సీఐలు వెంకటేశ్‌తోపాటు ముగ్గురు సీఐలు, ఐదుగురు ఎస్‌ఐలు, 80 మంది కానిస్టేబుళ్లు, 50 మంది హోంగార్డులు, డిస్ట్రిక్ట్‌ గార్డ్స్‌తో బందోబస్తు నిర్వహించనున్నట్లు పోలీస్‌ అధికారులు తెలిపారు. మహిళలు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే ‘డయల్‌ 100’కు ఫోన్‌ చేయాలని సీఐ వెంకటేశ్‌  తెలిపారు. ఏర్పాట్లను కమిషనర్‌, మున్సిపల్‌ చైర్మన్‌, వేములవాడ సెస్‌ డైరెక్టర్‌ రామతీర్థపు రాజు, కౌన్సిలర్లు  మధు, కొండ కనకయ్య, గోలి మహేశ్‌, నిమ్మశెట్టి విజయ్‌, శ్రీనివాసరావు, రామచంద్రం, బింగి మహేశ్‌, నరాల శేఖర్‌, మారం కుమార్‌ తదితరులు పరిశీలించారు.