బుధవారం 25 నవంబర్ 2020
Rajanna-siricilla - Oct 21, 2020 , 02:19:35

‘డబుల్‌' పనుల్లో వేగం పెంచాలి: ఆర్డీవో

‘డబుల్‌' పనుల్లో వేగం పెంచాలి: ఆర్డీవో

ఎల్లారెడ్డిపేట: తుది దశకు చేరుకున్న డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని ఆర్డీవో శ్రీనివాసరావు అన్నారు. బొప్పాపూర్‌లో కొనసాగుతున్న ఇండ్ల పనులను మంగళవారం ఆయన పరిశీలించి, మాట్లాడారు. మండలకేంద్రంతోపాటు వెంకటాపూర్‌, బొప్పాపూర్‌, గొల్లపల్లి, కోరుట్లపేటలో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు. త్వరలోనే లబ్ధిదారులకు ఇండ్లు అందిస్తామని చెప్పారు. ఇందులో తహసీల్దార్‌ శ్రీకాంత్‌, ఎంపీడీవో చిరంజీవి, డిప్యూటీ తహసీల్దార్‌ జయంత్‌, ఏపీవో కొముర య్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కొండాపురం బాల్‌రెడ్డి, ఇల్లెందుల శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.