బుధవారం 02 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Oct 21, 2020 , 01:50:10

ఆంగ్లభాషపై పట్టు సాధించాలి

ఆంగ్లభాషపై పట్టు సాధించాలి

టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు 

సిరిసిల్ల ఎడ్యుకేషన్‌: విద్యార్థులు చిన్నప్పటి నుంచే నుంచే ఆంగ్లభాషపై పట్టు సాధించాలని టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు గీవ్‌ తెలంగాణ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఇంగ్లిష్‌ డిక్షనరీలు అందించే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా ఇన్‌చార్జి తోట ఆగయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా రవీందర్‌రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్యను అందించాలనే ఉద్దేశంతో సర్కారు అనేక సదుపాయలు కల్పిస్తున్నదన్నారు. డిక్షనరీ రూపకల్పనలో భాగంగా విద్యార్థులకు ఆంగ్ల పదాలు సులభంగా అర్థమయ్యేలా మంత్రి కేటీఆర్‌ స్వయంగా కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారని గుర్తు చేశారు.  ఉపాధ్యాయుల బోధన,  డిక్షనరీలను అస్ర్తాలుగా చేసుకొని విద్యార్థులు రాణించాలని సూచించారు. అనంతరం కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతున్నదని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే నిరుపేద విద్యార్థులకు డిక్షనరీలు అందజేస్తున్న గీవ్‌ తెలంగాణ స్వచ్ఛంద సంస్థకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 90 ప్రభుత్వ పాఠశాలల్లో 13వేల డిక్షనరీలు పంపిణీ చేస్తున్నట్లు సంస్థ చైర్మన్‌ సంకేత్‌రావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య, డీఈవో డీ రాధాకిషన్‌, మున్సిపల్‌ అధ్యక్షురాలు జింద కళ, స్థానిక కౌన్సిలర్‌ గెట్యాల శ్రీనివాస్‌, కల్లూరి రాజు, సెక్టోరియల్‌ ఆఫీసర్‌ వీ రాంచందర్‌రావు, ఎంఈవో మంకు రాజయ్య, పాఠశాల హెచ్‌ఎం పరబ్రహ్మమూర్తి, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.