గురువారం 22 అక్టోబర్ 2020
Rajanna-siricilla - Oct 18, 2020 , 03:45:52

మంత్రి గంగులను కలిసిన రేషన్‌ డీలర్లు

మంత్రి గంగులను కలిసిన రేషన్‌ డీలర్లు

సిరిసిల్ల రూరల్‌: తంగళ్లపల్లి మండల రేషన్‌డీలర్లు శనివారం అధ్యక్షుడు పొన్నం శ్రీనివాస్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ నేత పడిగెల రాజు ఆధ్వర్యంలో కరీంనగర్‌కు తరలివెళ్లి మంత్రి గంగుల కమలాకర్‌ను ప్రత్యేకంగా కలిశారు. డీలర్ల కమీషన్‌ విడుదల చేసిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న కమీషన్‌తోపాటు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి గంగుల హామీ ఇచ్చారని వారు పేర్కొనారు. ఇందులో సిలువేరి నర్సయ్య, జక్కుల రవీందర్‌, నలువాల రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్‌, కొడూరి పద్మ, బొడ్డు దుర్గయ్య, ఆసాని లక్ష్మారెడ్డి, గుర్రం రేణుక, మోర దేవేందర్‌ ఉన్నారు.


logo