శుక్రవారం 30 అక్టోబర్ 2020
Rajanna-siricilla - Oct 18, 2020 , 03:45:51

చిరు వ్యాపారులకు భరోసా

చిరు వ్యాపారులకు భరోసా

వేములవాడ: కరోనా కష్టకాలంలో చిరు వ్యాపారులకు ప్రభుత్వం ఆర్థిక చేయూత అందించేందుకు సిద్ధంగా ఉన్నదని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవి, జిల్లా పథక సంచాలకుడు సమ్మయ్య పేర్కొన్నా రు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని వీధి వ్యాపారులు అవగాహన సదస్సు నిర్వహించగా, ఆమె మాట్లాడారు. కరోనా కష్ట సమయంలో వీధి వ్యాపారులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభు త్వం రుణాలు అందజేస్తున్నదని తెలిపారు. చిరు వ్యాపారులకు ప్రభుత్వ రుణాలను సద్వినియో గం చేసుకోవాలని సూచించారు. పూచీకత్తు లేకుండా రూ.10వేల చొప్పున మం జూరు చేస్తుండగా, ఈ రుణాలను ఏడాది లోపు బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో క్యూర్‌ కోడ్‌ ఆధారిత డిజిటల్‌ లావాదేవీలకు చిరు వ్యాపారులు  ప్రాధా న్యం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పథక సంచాలకుడు సమ్మయ్య, కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ మధురాజేందర్‌, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ రంగారెడ్డి, శ్రీనిధి మేనేజర్‌ గీతాంజలి, టీఎంసీ భూలక్ష్మి, టీఎల్‌ఎఫ్‌ ప్రెసిడెంట్‌ నిర్మల, కౌన్సిలర్‌ ముప్పి డి సునంద, వీధి వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.