శుక్రవారం 30 అక్టోబర్ 2020
Rajanna-siricilla - Oct 18, 2020 , 03:45:51

కొలువుదీరిన అమ్మవారు

కొలువుదీరిన అమ్మవారు

ఘనంగా దేవీశరన్నవరాత్రోత్సవాలు ప్రారంభం

మండపాల్లో ప్రత్యేక పూజలు 

దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా దుర్గామాత విగ్రహాలను శనివారం ప్రతిష్టించారు. విద్యుద్దీపాలతో సుంద రంగా అలంకరించిన మండపాల్లో కొలువుదీరిన అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. వేదపండితులు ప్రత్యేక పూజలు చేయగా, మహిళలు మంగళ హారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

వేములవాడ కల్చరల్‌/కోనరావుపేట/చందుర్తి/ ఎల్లా రెడ్డిపేట/ ఇల్లంతకుంట/సిరిసిల్ల కల్చరల్‌/ గంభీ రావుపేట/ రుద్రంగి: వేములవాడ రాజన్న క్షేత్రం శరన్నవరాత్రుల శోభను సంతరించుకుంది. పట్టణంలోని పలు కూడళ్లలో దేవీ నవరాత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు డప్పుచప్పుళ్లతో అమ్మవారి విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి మండపాల్లో కొలువుదీర్చారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. కోనరావుపేట మండలం మామిడిపల్లిలో రెడ్డి యూత్‌ ఆధ్వర్యంలో ఉత్సవాలు ప్రారంభమయ్యా యి. అమ్మవారు శ్రీస్వర్ణ కవచ అలంకృత దేవీ అవతారంలో దర్శనం ఇవ్వగా భక్తులు దర్శించుకున్నారు. ఇందులో యూత్‌ అధ్యక్షుడు తిపిరెడ్డి మహేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ పన్నాల విజయ, శ్రీనివాస్‌రెడ్డి, చిన్ను, రాజశేఖర్‌రెడ్డి, సుకుమార్‌రెడ్డి ఉన్నారు. చందుర్తి మం డల కేంద్రంలోని సెస్‌ కార్యాలయంలో డైరెక్టర్‌ అల్లాడి రమేశ్‌ ఆధ్వర్యంలో దుర్గామాతా విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట మండల కేం ద్రంతోపాటు పలు గ్రామాల్లో దుర్గామాతకు పూజలు నిర్వహించారు. ఇల్లంతకుంట మండల కేంద్రం గంగాధర క్షేత్ర ఆవరణలో మూగు నాగరాజుశర్మ ఆధ్వర్యం లో చండీహోమం నిర్వహించారు. సిరిసిల్ల పట్టణంలో శ్రీ జగదాంబసేవా సమితి అంభికానగర్‌ ఆధ్వర్యంలో అమ్మవారిని పట్టణ పురవీధుల గుండా ఊరేగిం పుగా తీసుకువచ్చి ప్రతిష్టించారు. అనంతరం ప్రత్యేక పూజ లు చేశారు. గంభీరావుపేట మండలంలో ఉత్స వాలు ప్రారంభం కాగా, మహిళలు ప్రత్యేక పూజలు చేసి మొ క్కులు చెల్లించుకున్నారు. రుద్రంగి మండల కేంద్రం లోని మహాలక్ష్మి వీధిలో ప్రతిష్టించిన అమ్మ వారు దుర్గాదేవీ అవతారంలో దర్శనమివ్వగా, భక్తులు ప్రత్యే క పూజలు చేశారు. అలాగే మండల కేంద్రంలోని ప్రహ్లాద గుట్టపై వెలిసిన లక్ష్మీనర్సింహ స్వామి ఆల యంలో ప్రత్యేక పూజలు చేశారు. తొమ్మిది రోజుల పా టు స్వామివారు పల్లకీపై గ్రామంలో పురవీధుల గుం డా భక్తులకు దర్శనమిస్తారని ఆలయ కమిటీ చైర్మన్‌ పిప్పరి మోహన్‌ తెలిపారు. ఎంపీపీ గంగం స్వరూపా రాణి దంపతులు, సర్పంచ్‌ తర్రె ప్రభలత దంపతులు పూజలు నిర్వహించారు.