శుక్రవారం 30 అక్టోబర్ 2020
Rajanna-siricilla - Oct 18, 2020 , 03:45:49

రైతుల సంఘటితానికే వేదికలు

రైతుల సంఘటితానికే వేదికలు

ఎంపీపీ జనగామ శరత్‌రావు

ముస్తాబాద్‌: రైతులు సంఘటితంగా ఉండాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం వేదికలు నిర్మిస్తున్నదని ఎంపీపీ జనగామ శరత్‌రావు, ఆర్‌బీఎస్‌ మండల కన్వీనర్‌ కల్వకుంట్ల గోపాల్‌రావు పేర్కొన్నారు. మద్దికుంటలో రూ.22 లక్షలతో నిర్మిస్తున్న రైతు వేదికను డీఆర్డీవో కౌటిల్యారెడ్డి, స్థానిక నాయకులతో కలిసి శనివారం ఆయన పరిశీలించి, మాట్లాడారు. రైతులను ఒకేచోటుకు చేర్చి సాగులో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులను వివ రించేందుకు వేదికలు దోహదం చేస్తామన్నారు. మండలంలోని ఏడు క్లస్టర్ల లో యుద్ధప్రాతిపదికన వేదికల నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకోవా లన్నారు. ఇందులో స్థానిక నాయకులు, ఎంపీడీవో రమాదేవి ఉన్నారు.