ఆదివారం 01 నవంబర్ 2020
Rajanna-siricilla - Oct 17, 2020 , 02:26:17

వేదికలు వేగంగా పూర్తి చేయాలి:కలెక్టర్‌

వేదికలు వేగంగా పూర్తి చేయాలి:కలెక్టర్‌

రుద్రంగి: రైతు వేదిక నిర్మాణాల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలో నిర్మిస్తున్న వేదిక పనులను శుక్రవారం ఆయన పరిశీలించి, మాట్లాడారు. రైతులను సంఘటితం చేసేందుకు వేదికలను నిర్మిస్తున్నామని తెలిపారు. రైతులు తమ సమస్యలపై చర్చించి పరిష్కరించేందుకు ప్రభుత్వం వేదికలను ఏర్పాటు చేస్తున్నదన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించి వేదిక పనులను పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ డీఈ భూమేశ్‌, జడ్పీటీసీ గట్ల మీనయ్య, తహసీల్దార్‌ మహ్మద్‌ తఫాజుల్‌ హుస్సేన్‌, ఎంపీడీవో శంకర్‌, ఎస్‌ఐ మహేశ్‌, ఎంపీవో సుధాకర్‌, నాయకులు మాడిశెట్టి ఆనందం, తర్రె మనోహర్‌, దయ్యాల నారాయణ, పిడుగు లచ్చిరెడ్డి, నర్సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

చందుర్తి: మూడపల్లి, మర్రిగడ్డ, చందుర్తి, మల్యాల క్లస్టర్లలో నిర్మిస్తున్న రైతు వేదికలను కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వేదికల నిర్మాణ పనులను సకా లంలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచిం చారు. ఇందులో తహసీల్దార్‌ నరేశ్‌, ఏఈవో దుర్గారాజు, ఏఈ వెంకటేశ్వర్లు, డీఈ భూమేశ్‌, వైస్‌ ఎంపీపీ అబ్రహం, సర్పంచులు చిలుక అంజిబాబు, లక్ష్మీనారాయణ, నేతికుంట జల పతి, సిరికొండ ప్రేమలత, నాయకులు శ్రీని వాస్‌, ఏఈవోలు ఉన్నారు.