సోమవారం 30 నవంబర్ 2020
Rajanna-siricilla - Oct 17, 2020 , 02:26:14

అధైర్యపడవద్దు.. ఆదుకుంటాం

అధైర్యపడవద్దు.. ఆదుకుంటాం

పంట నష్టపోయిన అన్నదాతలకు అండగా ఉంటాం

ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌

ఆందోళన చెందవద్దు: టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి, జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ

పలు గ్రామాల్లో దెబ్బతిన్న వరి పంటలన పరిశీలన

ఇల్లంతకుంట: ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో పంటలకు నష్టం జరిగిందని, రైతులు అధైర్యపడవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ పేర్కొన్నారు. అనంతగిరి, సిరికొండ, తిప్పాపూర్‌, పెద్దలింగాపూర్‌ గ్రామాల్లో నష్టపోయిన రైతుల పంటలు, ఒర్రెను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అన్నపూర్ణ ప్రాజెక్టు సర్‌ఫేజ్‌ గేట్ల ద్వారా వచ్చే వరద నీటికి దాదాపు 70 మంది రైతులకు చెందిన 120 ఎకరాలకు పైగా పంటకు నష్టం జరిగిందన్నారు. వెంటనే సర్వే చేయించి పరిహారం ఇప్పిస్తామన్నారు. ఒర్రెల భవిష్యత్‌ ద్వారా ఎలాంటి నష్టం జరుగకుండా కెనాల్‌ను నిర్మిస్తామని తెలిపారు. 

నిర్మాణాలు పూర్తి చేయాలి

పెద్దలింగాపూర్‌ బ్రిడ్జి, అనంతారం బిక్కవాగుపై చేపడుతున్న బ్రిడ్జి పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ప్రాంతాల్లోని రోడ్లను మరమ్మతు చేయాలని సూచించా రు. అనంతరం మండల పరిషత్‌లో అన్ని శాఖల అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ సిద్ధం వేణు, ఎంపీపీ ఊట్కూరి వెంకటరమణారెడ్డి, సెస్‌ డైరెక్టర్‌ గుడిసె ఐలయ్య, ఏఎంసీ చైర్మన్‌ చింతపెల్లి వేణురావు, తహసీల్దార్‌ రాజిరెడ్డి, ఎంపీడీవో విజయ, సర్పంచులు గొడిసెల జితేందర్‌, దమ్మని లక్ష్మి, పల్లె నర్సింహారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్‌ మీసరగండ్ల అనిల్‌, నాయకులు కరుణాకర్‌రెడ్డి, లక్ష్మణ్‌ ఉన్నారు. 

ఆందోళన చెందవద్దు: కొండూరి

గంభీరావుపేట: ప్రకృతిరీత్యా పంటలు నష్టపోయిన అన్నదాతలు ఆందోళన చెందవద్దని టెస్కా బ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు స్పష్టం చేశా రు. మల్లుపల్లి, నాగంపేట, దమ్మన్నపేటలో దెబ్బతిన్న పంటలను శుక్రవారం ఆయన పరిశీలించి, మాట్లాడారు. పంట చేతికొచ్చే సమయంలో నేలవాలడం దురదృష్టకరమని, రైతులు ఆందోళన చెందవద్దన్నారు. మండలంలో సుమారు 800 ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగిందన్నారు. ప్రతి గింజనూ ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుందని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో నిర్వహించిన పాలకవర్గ సమావేశానికి కొండూరి హాజరై, మాట్లాడారు. గంభీరావుపేట సంఘం పరిధిలోని గ్రామాల్లో 9 కొనుగో లు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులకు తగిన వసతులు కల్పిస్తూ, కొవిడ్‌ నిబంధనలు పాటించే విధంగా చూడాలన్నారు. ఇందు లో ఎంపీపీ వంగ కరుణ, జడ్పీటీసీ కొమిరిశెట్టి విజయ, సర్పంచులు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మోతె రాజిరెడ్డి, రాజేందర్‌, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు అహ్మద్‌, సర్పంచులు దోమకొండ లక్ష్మి, సుతారి బాలరాజు, సిరిగిరి లక్ష్మి, ఆర్‌బీఎస్‌ కన్వీనర్‌ రాజేందర్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ దయాకర్‌రావు, ఎంపీటీసీ మేరుగు నాగభూషణం, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పాపాగారి వెంకటస్వామిగౌడ్‌, సింగిల్‌ విండో ఉపాధ్యక్షుడు రామానుజగౌడ్‌, నేతలు కొమిరిశెట్టి లక్ష్మణ్‌, వంగ సురేందర్‌రెడ్డి, గౌరినేని నారాయణరావు, కమ్మరి రాజా రాం, దోసల రాజు, దేవారెడ్డి, జంగంపల్లి శేఖర్‌గౌడ్‌, ఆనందం, గంద్యాడపు రాజు, అంబర్‌సిం గ్‌, వేణు,  పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ ఎర్ర రామానుజగౌడ్‌, సీఈవో రాజిరెడ్డి, డైరెక్టర్లు ఉన్నారు.

అండగా ఉంటాం: జడ్పీ చైర్‌పర్సన్‌

కోనరావుపేట: పంట నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ పేర్కొన్నారు. శివంగాలపల్లిలో దెబ్బతిన్న వరి పంటను వ్యవసాయాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భారీ వర్షాలతో సుమారు 400ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అం చనా వేసినట్లు తెలిపారు. రైతుల సమస్యలను మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్యే రమేశ్‌బాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అనంతరం పంచాయతీ ఆవరణలో ఆడబిడ్డలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. తర్వాత మండల కేంద్రంలో నిర్మిస్తున్న రైతు వేదికను పరిశీలించా రు. మండలంలో ఆరు వేదికలు చివరి దశలో ఉన్నాయని చెప్పారు.  ఇక్కడ ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్‌, సెస్‌ డైరెక్టర్‌ దేవరకొండ తిరుపతి, పీఏసీఎస్‌ చైర్మన్‌ బండ నర్సయ్యయాదవ్‌, తహసీల్దార్‌ జక్కని నరేందర్‌, ఎంపీడీవో రామకృష్ణ, ఏవో వెంకట్రావమ్మ, సర్పంచ్‌ ఎల్లయ్య, ఎంపీటీసీ నరసింహాచారి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రాఘవరెడ్డి, ఏఈవో శివ నాయకులు తదితరులు పాల్గొన్నారు.