ఆదివారం 29 నవంబర్ 2020
Rajanna-siricilla - Oct 16, 2020 , 02:14:32

కలాంను ఆదర్శంగా తీసుకోవాలి

కలాంను ఆదర్శంగా తీసుకోవాలి

వేములవాడ: మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంను నేటి యువత ఆదర్శం గా తీసుకోవాలని టీఆర్‌కే చారిటబుల్‌ ట్రస్టు డైరెక్టర్లు మహేశ్‌కుమార్‌, వుప్పుల దేవరాజు పేర్కొన్నారు. గురువారం టీఆర్‌కే చారిటబుల్‌ ట్రస్టు కార్యాయంలో అబ్దుల్‌ కలాం 89వ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా వర్కింగ్‌ టీమ్‌ సభ్యులు కలాం చిత్రపటానికి పూమాలలు వేసి నివాళులర్పించారు. ఇందులో ట్రస్టు ప్రధాన కార్యదర్శి నాయిని శేఖర్‌, వర్కింగ్‌ టీమ్‌ సభ్యులు ఉన్నారు.

కోనరావుపేట: మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం జయంతిని మరిమడ్లలో నిర్వహించారు. ఈ సందర్భంగా యువకులు కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సర్పంచ్‌ మాట్ల అశోక్‌, మాజీ సర్పంచ్‌ శ్రీనివాస్‌,  కుమ్మరి దిలీప్‌, రాంచంద్రం, సుంకటి అశోక్‌, బొల్లం శ్రీనివాస్‌, రాములు, అంబేద్కర్‌ యూత్‌ సభ్యులు ఉన్నారు.

ఇల్లంతకుంట: మండల కేంద్రంలోని బస్టాండ్‌ ఆవరణలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం జయంతిని బీజేపీ నాయకులు నిర్వహించారు. మండలాధ్యక్షుడు బెంద్రం తిరుపతిరెడ్డి, నాగసముద్రాల సంతోష్‌, స్వామి, సంపత్‌, ఆంజనేయులు, శ్రీహరి, ముత్యం ఉన్నారు.

కలప పట్టివేత

చందుర్తి: మండల కేంద్రంలోని అటవీ శివారులో గుర్తు తెలియని దుండగులు చెట్లను నరికి, కలపను నిల్వ చేశారు. సమాచారం మేరకు దాడి చేసి రూ.15వేల విలువైన కలపను స్వాధీనం చేసుకున్నామని అటవీశాఖ అధికారి భూమేశ్‌ తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరిపి, కారకులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.