సోమవారం 23 నవంబర్ 2020
Rajanna-siricilla - Oct 15, 2020 , 02:01:39

పోలీసుల సేవలు అభినందనీయం

పోలీసుల సేవలు అభినందనీయం

  • lకరోనా సమయంలో పనితీరు భేష్‌ 
  • lరాజన్న సిరిసిల్ల  జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే
  • l1995 బ్యాచ్‌ సిల్వర్‌ జూబ్లీ వేడుకలు

సిరిసిల్ల క్రైం: కరోనా సమయంలో పోలీసులు, అధికారుల సేవలు అభినందనీయమని, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ విధులు సక్రమంగా నిర్వహించారని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే కొనియాడారు. ఈ మేరకు జిల్లా పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో బుధవారం 1995 బ్యాచ్‌ అధికారులు నిర్వహించిన సిల్వర్‌ జూబ్లీ వేడుకలకు ఎస్పీ రాహుల్‌ హెగ్డే హాజరై మాట్లాడారు. పోలీస్‌ అధికారులు సిల్వర్‌ జూబ్లీ వేడుకలను జరుపుకోవడం అభినందనీయమన్నారు. ‘మీ సేవలు నేటి తరానికి ఆదర్శనీయ’మని కొనియాడారు. అంతకుముందు ఆర్‌ఐ అడ్మిన్‌ సంపత్‌కుమార్‌ మాట్లాడారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 1995 సంవత్సరంలో 293 మంది కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారని, వీరిలో జిల్లాలో 42 మంది ఉన్నారని చెప్పారు. ఈ బ్యాచ్‌లో 24 మంది వివిధ కారణాలతో మృతి చెందారని, వారి ఆత్మకు శాంతి గలగాలని రెండు నిమిషాలు పాటు మౌనం పాటించారు. అనంతరం 1995 బ్యాచ్‌ అధికారులతో కలిసి కేక్‌ కట్‌ చేసి, స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా ఆ బ్యాచ్‌కు చెందిన 42 మంది అధికారులకు జ్ఞాపికలు అందజేశారు.అనంతరం వారు ఎస్పీ రాహుల్‌ హెగ్డేను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆ బ్యాచ్‌ అధికారులు వృద్ధాశ్రమానికి 10వేల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఆర్‌ఐ రజనీకాంత్‌, కుమారస్వామి, 1995 బ్యాచ్‌ అధికారులు, సిబ్బంది ఉన్నారు.