మంగళవారం 24 నవంబర్ 2020
Rajanna-siricilla - Oct 15, 2020 , 02:01:40

అప్రమత్తంగా ఉండాలి

అప్రమత్తంగా ఉండాలి

  • ముంపు ప్రాంతాలను ముందే గుర్తించాలి 
  • lప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి
  • lరాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌
  • lహైదరాబాద్‌ నుంచి ఫోన్‌ ద్వారా  సిరిసిల్ల కలెక్టర్‌, ఎస్పీతో సమీక్ష  

సిరిసిల్ల కలెక్టరేట్‌: భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారులను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి ఫోన్‌లో కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, ఎస్పీ రాహుల్‌ హెగ్డేలతో మాట్లాడారు. వర్షాలు, వరదల నేపథ్యంలో జిల్లా సమీక్షించారు. ప్రస్తుత పరిస్థితిని తెలుసుకున్నారు. అత్యవసర సర్వీసుల్లో భాగంగా అధికారులు, సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. నీట మునిగే ప్రాంతాలను ముందే గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, అవసరమైన సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. అత్యవసర సమయాల్లో సహాయార్థం 24 గంటలు పనిచేసేలా కంట్రోల్‌ రూమ్‌ నడిపించాలని సూచించారు. ప్రాణ నష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు పాటించాలని, ఆస్తి నష్టం అంచనా వేసి బాధితులకు అండగా నిలువాలని సూచించారు. జిల్లాలోని ఎస్సారార్‌, ఎగువమానేరు ప్రాజెక్టులకు వరద ఉధృతి తీవ్రంగా ఉన్నందున, ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, పరీవాహక ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. వర్షాలు పూర్తిగా తగ్గే వరకు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తూ పనిచేయాలని ఆదేశించారు.