బుధవారం 02 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Oct 07, 2020 , 02:57:44

నులి పురుగుల నిర్మూలనకు సహకరించాలి

నులి పురుగుల నిర్మూలనకు సహకరించాలి

సిరిసిల్ల రూరల్‌: నులిపురుగుల నిర్మూలనకు అందరూ సహకరించాలని అదనపు కలెక్టర్‌ అంజయ్య పేర్కొన్నారు. సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని జగ్గారావుపల్లె, సర్దాపూర్‌లో నులి పురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన మంగళవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 19 సంవత్సరాల వయసు లోపు గల వారికి ఆల్బెండజోల్‌ మాత్రలు తప్పకుండా వేయించాలని సూచించారు. ఈనెల 11వ తేదీ వరకు మాత్రల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో సిరిసిల్ల సీడీపీవో అలేఖ్య, కౌన్సిలర్‌ లింగంపల్లి సత్యనారాయణ, రఫీ, నారాయణ, సల్లూరి సునీత, కాయితీ గౌతమి తదితరులున్నారు.

మార్కండేయనగర్‌లో

వేములవాడ: పట్టణంలోని మార్కండేయనగర్‌లో 19 సంవత్సరాల వయసులోపు గల పిల్లలకు అంగన్‌వాడీ టీచర్‌, ఆశ వర్కర్‌ ఆల్బెండజోల్‌ మాత్రలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తల్లిదండ్రులు పిల్లలకు ఆల్బెండజోల్‌ మాత్రలు తప్పక వేయించాలని సూచించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్‌ జ్యోతి, ఆశ వర్కర్‌ వైష్ణవి ఉన్నారు.

వట్టిమల్ల గొల్లపల్లిలో

కోనరావుపేట: చిన్నారులకు నులి పురుగుల నివారణ మాత్రలను తప్పక వేయించాలని సర్పంచ్‌ గోపు పరశురాములు అన్నారు. వట్టిమల్ల గొల్లపల్లి గ్రామంలో ఆల్బెండజోల్‌ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించి మాట్లాడారు. ఇక్కడ ఉప సర్పంచ్‌ బండ రవి, అంగన్‌వాడీ టీచర్‌ షీలా, ఆశ కార్యకర్త ఉన్నారు.