మంగళవారం 24 నవంబర్ 2020
Rajanna-siricilla - Oct 05, 2020 , 03:17:22

ఇంటింటికీ ఆల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ

ఇంటింటికీ ఆల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ

జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు

సిరిసిల్ల టౌన్‌:  జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంలో భాగంగా ఇంటింటికీ ఆల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు తెలిపారు. ఆదివారం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 5నుంచి 12వరకు ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు తమ పరిధిలోని ఇంటింటికీ వెళ్లి మాత్రలు పంపిణీ చేయాలని ఆదేశించారు. జిల్లాలో 1-19 సంవత్సరాల్లోపు పిల్లలు లక్షా 46వేల 500 మంది ఉన్నట్లు గుర్తించామన్నారు. వారందరికీ ఆల్బెండజోల్‌ మాత్రలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సమావేశంలో ఆర్‌బీఎస్‌కే కోఆర్డినేటర్‌ వైద్యుడు మహేశ్‌ పాల్గొన్నారు.