సోమవారం 23 నవంబర్ 2020
Rajanna-siricilla - Oct 03, 2020 , 06:02:34

గవర్నర్‌కు భగవద్గీత అందజేత

గవర్నర్‌కు భగవద్గీత అందజేత

వేములవాడ: వేములవాడకు చెందిన రాగంపేట శంకరయ్య భగవద్గీతను గతంలో ఆంగ్లంలోకి అనువదించాడు. అతని అల్లుడు డాక్టర్‌ వైఎస్‌ మూర్తి హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళసైని శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శంకరయ్య అనువదించిన భగవద్గీతను గవర్నర్‌కు అందజేశారు. 

రాజన్న సన్నిధిలో రద్దీ

వేములవాడ కల్చరల్‌: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆల యం శుక్రవారం భక్తులతో సాధారణ రద్దీగా కనిపించింది. గాంధీ జయంతి సందర్భంగా దాదాపుగా 6,200 మంది స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ సహాయ కార్య నిర్వహణాధికారి సంకెపల్లి హరికిషన్‌ తెలిపారు. భక్తులు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకున్నారని ఆయన చెప్పారు. రేవతి నక్షత్రం సందర్భంగా ఆలయ అద్దాల మండపం లో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.


పారిశుద్ధ్య సిబ్బంది సేవలు అభినందనీయం

 మున్సిపల్‌ అధ్యక్షురాలు మాధవి

వేములవాడ: కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ పారిశుద్ధ్య సిబ్బంది అం దించిన సేవలు అభినందనీయమని మున్సిపల్‌ అధ్యక్షురాలు రామతీర్థపు మాధవి కొనియడారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ఆనవాయితీగా శుక్రవారం ఆమె కార్యాలయంలో పారిశుద్ధ్య సిబ్బందికి నూతన దుస్తులు అందజేసి, మాట్లాడారు. కరోనా కాలంలోనూ పారిశుద్ధ్య సిబ్బం ది బాధ్యతగా విధులు నిర్వర్తించి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచారన్నారు. రెగ్యులర్‌ సిబ్బందికి మూడు జతలు, కాంట్రాక్టు సిబ్బందికి రెండు జతల దుస్తులు అందజేశామని తెలిపారు. ఇందులో కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ మధురాజేందర్‌, కౌన్సిలర్లు, కో ఆప్షన్‌ సభ్యులు ఉన్నారు.


కొవ్వొత్తుల ర్యాలీ

బోయినపల్లి: ఉత్తరప్రదేశ్‌లో అత్యాచారానికి గురై చనిపోయిన యువతి ఆత్మకు శాంతి కలుగాలని, నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలని అనంతపల్లిలో అంబేద్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఇందులో సభ్యులు గంగాధర లక్ష్మణ్‌, ప్రేమ్‌కుమా ర్‌, దుర్గ య్య, రమేశ్‌, రత్నాకర్‌, ప్రభాకర్‌, మల్లయ్య, రాజయ్య ఉన్నారు.


ఆటోమెటిక్‌ మీటర్లు ప్రారంభం

ఎల్లారెడ్డిపేట: బొప్పాపూర్‌లో వీధి దీపాలకు బిగించిన ఆటోమెటిక్‌ మీటర్లను సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కొండాపురం బాల్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. సిబ్బంది కొరతతో ఆటోమెటిక్‌ మీటర్లు బిగించామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఇల్లెందుల శ్రీనివాస్‌రెడ్డి, వంగ బాపురెడ్డి, కార్యదర్శి సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.