గురువారం 26 నవంబర్ 2020
Rajanna-siricilla - Oct 03, 2020 , 06:02:27

మత్స్యకారుల అభ్యున్నతికి కృషి

మత్స్యకారుల అభ్యున్నతికి కృషి

ఎంపీపీ లావణ్య, ఏఎంసీ చైర్మన్‌ హన్మాండ్లు 

పలు చెరువుల్లో చేప పిల్లల విడుదల

వేములవాడ రూరల్‌: మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభు త్వం కృషి చేస్తున్నదని వేములవాడ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డం హన్మాండ్లు పేర్కొన్నారు. వేములవాడ రూరల్‌ మం డలం ఫాజుల్‌నగర్‌ చెరువులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం చేప పిల్లలను వదిలిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఉచితంగా చేపల పిల్లలను పంపిణీ చేస్తున్నదని తెలిపారు. దీంతో మత్స్య కార్మికులకు ఉపాధి లభిస్తున్నదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే రమేశ్‌బాబు సహకారంతో ఈ ప్రాం తాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. ఇందులో సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు ఏశ తిరుపతి, వేములవాడ పీఏసీఎస్‌ చైర్మన్‌ ఏనుగు తిరుపతిరెడ్డి, సర్పంచ్‌ వేణుగోపాల్‌, మాజీ సర్పంచ్‌ లక్ష్మణ్‌రావు, షేక్‌ హుస్సేన్‌ పాల్గొన్నారు. 

మత్స్య సంపద పెంచేందుకు కృషి

చందుర్తి: రాష్ట్ర ప్రభుత్వం మత్స్య సంపద పెంచేందుకు కృషి చేస్తున్నదని ఎంపీపీ బైరగోని లావణ్య పేర్కొన్నారు. సర్పంచ్‌ న్యాత విజయతో కలిసి శుక్రవారం బండపల్లి చెరువులో 86వేల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్బంగా ఎంపీపీ మాట్లాడుతూ, చెరువులు జలకళను సంతరించుకోవడంతో మత్స్యకారులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపేందుకు ప్రభుత్వం రాయితీపై వాహనాలు, వలలు అందజేస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ గంగాధర్‌, మత్స్యశాఖ అధికారులు సుదర్శన్‌, కిరణ్‌, మంజుల, శివ, గంగపుత్ర సం ఘం అధ్యక్షుడు నర్సయ్య, శ్రీనివాస్‌, లక్ష్మణ్‌, రవి, లచ్చ య్య, సత్తయ్య, ప్రభాకర్‌, రాములు, నరేశ్‌, రవి ఉన్నారు.