శుక్రవారం 30 అక్టోబర్ 2020
Rajanna-siricilla - Oct 02, 2020 , 02:29:16

ట్రాక్టర్ల ర్యాలీ గ్రాండ్‌ సక్సెస్‌

ట్రాక్టర్ల ర్యాలీ గ్రాండ్‌ సక్సెస్‌

మంథని టౌన్‌: సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ ఆధ్వర్యంలో మంథనిలో గురువారం నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీ విజయవంతమైంది. మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరాంనగర్‌ నుంచి మంథని బడ్‌ డిపో వరకు దాదాపు 3 కిలోమీటర్ల వరకు కొనసాగిన ఈ ర్యాలీలో మంథని, ముత్తారం, కమాన్‌పూర్‌, రామగిరి, మల్హర్‌ మండలాల నుంచి రైతులు ట్రాక్టర్లలో తరలివచ్చారు.  దాదాపు 2,300 ట్రాక్టర్లతో కొనసాగిన ఈ ర్యాలీని శ్రీరాంనగర్‌లో జయశంకర్‌ భూపాలపల్లి జడ్పీ చైర్మన్‌ జక్కు శ్రీహర్షిణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రఘువీర్‌సింగ్‌తో కలిసి పుట్ట మధూకర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్‌ స్వయంగా ట్రాక్టర్‌ నడుపుకుంటూ ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీ తీశారు. కూచీరాజ్‌పల్లి గ్రామ శివారులోని పత్తి చేనులో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి రైతులతో కలిసి పుట్ట మధూకర్‌ పాలాభిషేకం నిర్వహించారు. మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారి ట్రాక్టర్లతో నిండి పోయి గులాబీ దండుగా దర్శనమిచ్చింది. ట్రాక్టర్‌ ర్యాలీ సందర్భంగా పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు మంథని పట్టణ శివారులోని ఏఎంసీ కార్యాల యం నుంచి బైక్‌ ర్యాలీని సైతం నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన సభ వద్ద ట్రాక్టర్ల ర్యాలీ ముగిసింది. ఈ ర్యాలీ సందర్భంగా పెద్దపల్లి డీసీపీ రవీందర్‌ ఆధ్వర్యంలో మంథని సీఐ ఆకునూరి మహేందర్‌, ఎస్‌ఐ ఓంకార్‌యాదవ్‌తోపాటు పలువురు స్పెషల్‌ పార్టీ పోలీసులు, కానిస్టేబుళ్లు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ కొండా శంకర్‌, జడ్పీటీసీ తగరం సుమలత, సింగిల్‌ విండో చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు ఏగోలపు శంకర్‌గౌడ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆరెపల్లి కుమార్‌, పుట్ట లింగమ్మ చారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌ తులిసెగారి శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు తగరం శంకర్‌లాల్‌, మంథని లక్ష్మణ్‌, కుం ట శ్రీనివాస్‌, బత్తుల సత్యనారాయణ, సమ్మ య్య, వీకే రవి, కుర్రు లింగయ్య, గర్రెపల్లి సత్యనారాయణ, సామ్రాట్‌, సల్మాన్‌ పాల్గొన్నారు. 

కమాన్‌పూర్‌:  నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన ట్రాక్టర్‌ ర్యాలీ కార్యక్రమానికి మండల ప్రజాప్రతినిధులు, నాయకులు తరలివెళ్లారు. ఎంపీపీ రాచకొండ లక్ష్మి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పిన్‌రెడ్డి కిషన్‌రెడ్డి  కమాన్‌పూర్‌, జూ లపల్లి, గుండారం, సిద్దిపల్లె, పేరపల్లి, గొల్లపల్లి, రొంపికుంట, నాగారం, పెంచికల్‌పేట గ్రామాల నుంచి టీఆర్‌ఎస్‌ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, రైతులు, రైతు బంధు సమితి సభ్యులు ట్రాక్టర్లతో అధికసంఖ్యలో తరలివెళ్లారు.

రామగిరి: మండలకేంద్రంలో ట్రాక్టర్ల ర్యాలీని జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్‌ రఘువీర్‌సింగ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పూదరి సత్యనారాయణగౌడ్‌తో కలిసి ప్రారంభించారు.  కార్యక్రమంలో ఎంపీపీ ఆరెల్లి దేవక్క, జడ్పీటీసీ మేదరబోయిన శార ద, వైస్‌ ఎంపీపీ కాపురబోయిన శ్రీదేవి, సర్పంచులు ఎండీ మంజూర్‌, అల్లం పద్మ, పల్లె ప్రతిమ, బుర్ర పద్మ, పాశం ఓదె లు, దాసరి శంకర్‌, హరీశ్‌, ఎంపీటీసీలు ధర్ముల రాజ సంపత్‌, కామ శ్రీనివాస్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు బేతు కుమార్‌, ఆసం తిరుపతి, కో-ఆప్షన్‌ సభ్యుడు ఇబ్రహీం, నాయకులు కొమురయ్య, కుమార్‌, భాస్కర్‌, తిరుపతి, పీవీ రావు, శంకర్‌ గౌడ్‌, దాసరి రాజలింగు, నరేశ్‌, జాఫర్‌, పుల్లెల కిరణ్‌, కృష్ణ, రమణారెడ్డి, గాజుల ప్రసాద్‌, శ్రీనివాస్‌, మల్యాల మోహన్‌, ఎండీ ఆరిఫ్‌, ప్రశాంత్‌, శ్రీనివాస్‌, దామెర శ్రీనివాస్‌, రవీందర్‌, సంజీవ్‌ తదితరులున్నారు.  

ముత్తారం: మండలం నుంచి ట్రాక్టర్లతో ప్రజాప్రతినిధులు, నాయకులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. ఎంపీపీ జక్కుల ముత్త య్య, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు అత్తె చంద్రమౌళి ఆధ్వర్యంలో మండలకేంద్రంలోని అడవిశ్రీరాంపూర్‌ చౌరస్తా వద్ద నుంచి దాదాపు రెండు వందల ట్రాక్టర్లతో ర్యాలీగా వెళ్లారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పొతిపెద్ది కిషన్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ గుజ్జుల రాజిరెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు నూనె కుమార్‌, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు అల్లం తిరుపతి, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ నాంసాని సమ్మయ్య, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ పొతిపెద్ది రమణారెడ్డి, వైస్‌ ఎంపీపీ సూదాటి రవీందర్‌రావు, సర్పంచులు సిరికొండ బక్కారావు, మహేందర్‌, తుంగాని సమ్మయ్య, సంపత్‌రావు, పులిపాక నగేశ్‌, అత్తె లలిత, స్రవంతి, పర్ష లక్ష్మి, ఉప్పు సుగుణ, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ నాయకులు భూపెళ్లి మొగిలి, ఇల్లందుల అశోక్‌, పూదరి మహేందర్‌, పాపారావు, గూట్ల రవి, సంజీవ్‌రెడ్డి, తాత తిరుపతి, బాలమల్లు, ఐతె రాజు, కూరాకుల ఓదెలు, జక్కుల ఓదెలు, నరెడ్ల నరేశ్‌, నాగినేని జగదీశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.