బుధవారం 28 అక్టోబర్ 2020
Rajanna-siricilla - Sep 27, 2020 , 02:12:49

అందుబాటులోకి రైతు బజార్‌

అందుబాటులోకి రైతు బజార్‌

  • n మంత్రి కేటీఆర్‌ చొరవతో యార్డు అభివృద్ధి 
  •  ప్రజలు ప్రతిపక్షాలను నమ్మవద్దు
  • n టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు చక్రపాణి 

సిరిసిల్ల టౌన్‌: రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవతో సిరిసిల్లలో నిర్మించిన మోడ్రన్‌ రైతు బజార్‌ అందరికీ అందుబాటులో ఉన్నదని టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి పేర్కొన్నారు. శనివారం ఆయన గాంధీనగర్‌లో మార్కెటింగ్‌శాఖ అధికారులతో కలిసి కూరగాయల విక్రయదారులతో మాట్లాడా రు. దశాబ్దాలుగా ఎంలాటి వసతులు లేకుండా రైతులు, విక్రయదారులు పడుతున్న అవస్థలను గుర్తించి మంత్రి కేటీఆర్‌ మార్కెట్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి చర్యలు తీసుకున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా మూడున్నర ఎకరాల సువిశాలమైన విస్తీర్ణంలో మోడ్రన్‌ రైతు బజార్‌ను ఏర్పాటు చేశారని తెలిపారు. పట్టణ ప్రజలతో పా టు రైతులు, విక్రయదారులకు సౌకర్యవంతంగా  అందుబాటులోకి తెచ్చారన్నారు. ఈ క్రమంలో రైతుబజార్‌ను అభివృద్ధి చేసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. విష యం తెలిసిన వెంటనే మున్సిపల్‌, మార్కెటింగ్‌ అధికారులను సమన్వయం చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. మంత్రి కేటీఆర్‌ చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీల నేతలు చిన్నపాటి సమస్యను పెద్దది చేసేందుకు కుట్ర చేశారని విమర్శించారు. మార్కెట్‌లో విక్రయదారుల సమస్యల పరిష్కారానికి మున్సిపల్‌ పాలకవర్గం, అధికారులు తక్షణంగా స్పందిస్తున్నారని పేర్కొన్నారు. కూరగాయల మార్కెట్‌ సంఘం నాయకులు మాట్లాడుతూ, మంత్రి కేటీఆర్‌ మార్కెట్‌ అభివృద్ధికి తీసుకున్న చర్యలు బాగున్నాయని కొనియాడారు. రైతుబజార్‌ అభివృద్ధిలో  భాగస్వాములవుతామని పేర్కొన్నారు. అనంతరం ‘జై కేసీఆర్‌, జై కేటీఆర్‌' అంటూ నినదించి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, మాజీ కౌన్సిలర్‌ గుండ్లపల్లి పూర్ణచందర్‌ పాల్గొన్నారు. 


logo