మంగళవారం 20 అక్టోబర్ 2020
Rajanna-siricilla - Sep 27, 2020 , 02:12:51

వేములవాడ అభివృద్ధికి పాటుపడాలి

వేములవాడ అభివృద్ధికి పాటుపడాలి

  • n ప్రజలకు పారదర్శకమైన సేవలందించాలి 
  • ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు
  • n జర్మనీ నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌
  • అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష 

కలెక్టరేట్‌: ప్రజలకు పారదర్శకమైన సేవలు అందిస్తూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై శనివారం ఆయన జర్మనీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో సమీక్షించారు. కలెక్టరేట్‌ సమావేశ మంది రం నుంచి వీసీకి జడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ, కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు. రైతు వేదికల పురోగతి గురించి ఆరా తీశారు. గుత్తేదారులు, అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో వీలైనంత త్వర గా వేదికలు పూర్తి చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులుంటే తమ దృష్టికి తేవాలన్నా రు. తిప్పాపూర్‌-జయవరం మధ్య నాబార్డు నిధు లు రూ.7కోట్లతో నిర్మిస్తున్న బ్రిడ్జిని 20రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఆయా గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై చర్చిచారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసే లా చూడాలన్నారు. పల్లె ప్రగ తి కార్యక్రమంలో భాగంగా వైకుంఠధామాలు, డంప్‌యార్డులు, కంపోస్ట్‌ షెడ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని కోరారు. డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు, సీసీ రోడ్ల నిర్మాణాలను పూర్తి చేయాలన్నా రు. తిప్పాపూర్‌ జంక్షన్‌ను అభివృద్ధి చేయాలన్నారు. పట్టణంలో మిషన్‌ భగీరథ నీటి సరఫరా అభివృద్ధి పనులపై సమీక్షించారు. ప్రజలకు నీటి సరఫరాలో అంతరాయం కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కొవిడ్‌-19నేపథ్యంలో ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్న వైద్యుల సేవలను కొనియాడారు. జిల్లా దవాఖానకు ‘కాయకల్ప అవార్డు’ రాగా, వైద్యులను అభినందించారు. ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రజలకు అవగాహన కల్పించి, వంద శాతం విజయవంతం అయ్యేలా చూడాలని మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌కు సూచించారు. పట్టణంలో 67 అక్రమ లే అవుట్లను గుర్తించి, నోటీసులు జారీ చేశామని కమిషనర్‌ వివరించారు. ముంపు గ్రా మాల సమస్యలు వెంటనే పరిష్కరించి, పెండింగ్‌ పేమెంట్లు వెంటనే జరపాలన్నారు. సంకెపల్లి, ఆరెపల్లికి పూర్తి ముంపు హోదా ఇచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చూడాలని అధికారులకు సూ చించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధికి అన్నివిధాలా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రగతిలో ఉన్న పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. వట్టెంలలో రైతు వేదిక నిర్మాణానికి స్థల సేకరణ సమస్య ఉందని, పరిష్కారానికి చొరవ చూపాలని కలెక్టర్‌ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. పురోగతిలో ఉన్న పనులను త్వరగా పూర్తి చేస్తామని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఇందులో అదనపు కలెక్టర్‌ ఆర్‌.అంజయ్య, పీఆర్‌ ఈఈ కనకరత్నం, డీఆర్‌డీవో కౌటిల్యారెడ్డి, డీపీ వో రవీందర్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ కిషన్‌రావు, జడ్పీ డిప్యూటీ సీఈవో నాగలక్ష్మి ఉన్నారు. logo