శుక్రవారం 30 అక్టోబర్ 2020
Rajanna-siricilla - Sep 26, 2020 , 02:04:30

ఆ యూనివర్సిటీలపై అప్రమత్తంగా ఉండాలి

ఆ యూనివర్సిటీలపై అప్రమత్తంగా ఉండాలి

  • లోక్‌సత్తా బాధ్యులు

కొత్తపల్లి: యూజీసీ గుర్తింపు లేని విదేశీ యూనివర్సిటీలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లోక్‌సత్తా ఉద్యమ సంస్థ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎన్‌ శ్రీనివాస్‌, ప్రకాశ్‌హొల్లా సూచించారు. కరీంనగర్‌లోని ఫిల్మ్‌భవన్‌లో శుక్రవారం వారు మా ట్లాడారు. గ్లోబల్‌పీస్‌, ఇంటర్నేషనల్‌ పీస్‌ యూనివర్సిటీలతోపాటు మరో మూడు విదేశీ సంస్థలు అర్హత లేని వారికి సైతం గౌరవ డాక్టరేట్లు ప్రదా నం చేస్తున్నాయని చెప్పారు.  కరీంనగర్‌ జిల్లాకు చెందిన కొందరు రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, టీచర్లు, ఇంజినీర్లు, కానిస్టేబుళ్లు ఈ గుర్తింపు లేని యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లు తీసుకున్నారని సమాచారం ఉందని తెలిపారు. ఇలాంటి వారు తమ పేర్ల ముందు డాక్టర్‌ అన్నపదం పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని ప్రకటించారు. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కరీంనగర్‌కు చెందిన కస్తూరి శ్రీనివాస్‌ వరప్రసాద్‌ అనే ఇంజినీరింగ్‌ నిరుద్యోగి మాట్లాడుతూ, తాను ఒక స్నేహితుడి ద్వారా తెలుసుకున్న సమాచారంతో గ్లోబల్‌ పీస్‌ యూనివర్సిటీ ప్రతినిధులను ఫోన్‌లో సంప్రదించానని చెప్పారు. విద్యార్హతలు, ఇతరత్రా సామాజిక సేవలు అడగకుండానే గంట వ్యవధిలోనే తనకు డాక్టరేట్‌ను మెయిల్‌ ద్వారా పంపించినట్లు తెలిపారు. తన వద్ద నుంచి రూ 20వేలు వసూలు చేశారని చెప్పారు. ఇలాంటి యూనివర్సిటీల మోసాలను బయటపెట్టేందుకే తాను లోక్‌సత్తాను ఆశ్రయించానని వివరించారు. అనంతరం గ్లోబల్‌ పీస్‌ యూనివర్సిటీ నుంచి వచ్చిన డాక్టరేట్‌ ధ్రువీకరణ పత్రాన్ని విలేకరులకు చూపించాడు. సమావేశంలో లోక్‌సత్తా జిల్లా బాధ్యులు ఆర్‌ చంద్రప్రభాకర్‌, సయ్యద్‌ ముజఫర్‌, అరుణ్‌, నాగమోహన్‌, కొండాల్‌రావు, చందర్‌, మునీర్‌ తదితరులు పాల్గొన్నారు.