మంగళవారం 27 అక్టోబర్ 2020
Rajanna-siricilla - Sep 26, 2020 , 02:04:31

ఎల్‌ఆర్‌ఎస్‌ పక్కాగా అమలు చేయాలి

ఎల్‌ఆర్‌ఎస్‌ పక్కాగా అమలు చేయాలి

  •  పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ

కొత్తపల్లి: కలెక్టర్‌ ఆదేశానుసారం గ్రామాల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ పక్కాగా అమలు చేసేందుకు పంచాయతీ కార్యదర్శులకు కలెక్టరేట్‌ ఆడిటోరియంలో శుక్రవారం శిక్షణ ఇచ్చారు. జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య ఆధ్వర్యంలో చేపట్టిన ఈ శిక్షణ కార్యక్రమానికి అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) ఏనుగు నరసింహారెడ్డి, జడ్పీ సీఈవో వెంకటమాధవరావు పాల్గొని ఎల్‌ఆర్‌ఎస్‌పై అవగాహన కల్పించారు.  గ్రామ పంచాయతీల్లో ఎల్‌ఆర్‌ఎస్‌, ఇంటి నంబర్ల కేటాయింపు, డిమాండ్ల రిజిస్టర్ల నిర్వహణ, పారిశుద్ధ్యం, ఇంటి పన్నుల వసూలు, ఇతర అంశాలపై అవగాహన కల్పించారు. పంచాయతీ కార్యదర్శులు తమ గ్రామాల పరిధిలో అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించుకొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పలు విభాగాల అధికారులు హరికిషన్‌, సురేందర్‌రెడ్డి, లత, జగన్‌మోహన్‌రెడ్డి, దేవదాసు, కిరణ్‌, సతీశ్‌కుమార్‌, నర్సింహారెడ్డి, రాజేశ్వర్‌, హుజూరాబాద్‌, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, మానకొండూర్‌, తిమ్మాపూర్‌, గన్నేరువరం, శంకరపట్నం మండలాల్లోని పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. 


logo