ఆదివారం 29 నవంబర్ 2020
Rajanna-siricilla - Sep 25, 2020 , 02:28:04

వ్యవసాయ బిల్లు బడా వ్యాపారులకే అనుకూలం

వ్యవసాయ బిల్లు బడా వ్యాపారులకే అనుకూలం

సారంగాపూర్‌ : కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లుతో రైతులకు ఎలాంటి లాభం లేదని, బడా వ్యాపారులకే అనుకూలంగా ఉందని కరీంనగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి పేర్కొన్నారు. బీర్‌పూర్‌ మండలంలోని ఆయా గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన మృతుల కుటుంబాలను గురువారం పరామర్శించారు. అనంతరం బీర్‌పూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త వ్యవసాయ బిల్లు వ్యాపారులకు అనుకూలంగా ఉందని విమర్శించారు. ఇక్కడున్న స్థానిక ఎంపీలు ఇక్కడి పరిస్థితులను అర్థం చేసుకోకుండా గుడ్డిగా కొత్త వ్యవసాయ బిల్లుకు మద్దతు తెలుపడం సరికాదన్నారు. కేంద్రం మక్కకు, రాష్ట్ర ప్రభుత్వం సన్నరకం వరికి మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. 

పేద విద్యార్థికి టీవీ అందజేత

పెద్దపల్లిరూరల్‌: నిట్టూరులో ఆర్థిక స్థోమతలేని విద్యార్థులకు ఉపాధ్యాయులు చేయూతనందిస్తున్నారు. గ్రామంలో ఏడుగురు విద్యార్థులు టీవీలు లేక పాఠాలు వినడంలేదనే విషయాన్ని గుర్తించి ఇద్దరు విద్యార్థులకు టీవీలను అందజేశారు. ఐదుగురికి సమీపంలోని ఇండ్లలో సర్దుబాటు చేశారు. వేల్పుల రమేశ్‌ అనే ఏడో తరగతి విద్యార్థికి ఉపాధ్యాయురాలు రమాదేవి టీవీని బహుకరించారు. రమాదేవికి రమేశ్‌ తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇన్‌చార్జి హెచ్‌ఎం పి.రమాదేవి, ఉపాధ్యాయులు రాణా ఫర్హీన్‌, సమ్మయ్య, తిరుపతిరావు, రవీందర్‌, తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు