మంగళవారం 01 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Sep 25, 2020 , 02:28:04

రైతులకు పరిహారం చెక్కుల పంపిణీ

రైతులకు పరిహారం చెక్కుల పంపిణీ

  • రైల్వేలైన్‌ కోసం భూములు కోల్పోయిన రైతులకు రూ.23 కోట్లు పంపిణీ

సిరిసిల్ల రూరల్‌: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ల్లపల్లి మండలం బస్వాపూర్‌, తాడూరు రెవెన్యూ గ్రామాల్లో కొత్తపల్లి-మనోహరబాద్‌ రైల్వే లైన్‌ కోసం భూములు కోల్పోయిన రైతులకు గురువారం నష్టపరిహారం చెక్కులను పంపిణీ చేశారు. 285 ఎకరాలకు రూ. 23 కోట్ల పరిహారం చెక్కులను తంగళ్లపల్లి ఎంపీపీ పడిగెల మానస, జడ్పీటీసీ పుర్మాణి మంజుల అందజేశారు. వారు మాట్లాడుతూ రైల్వే లైన్‌లో భూములు కోల్పోయిన రైతుల త్యాగాలు వెలకట్టలేనివన్నారు. భూములు కోల్పోయిన రైతులు అధైర్యపడవద్దని, అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఎకరానికి రూ.7లక్షలు పరిహారం కేటాయించగా,రైతుల కోసం తమ విజ్ఞప్తి మేరకు మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో మరో రూ.50వేలను ఎకరానికి పెంచి ఇస్తున్నారన్నారు. రైతులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కరోనా నేపథ్యంలో చెక్కుల పంపిణీలో జాప్యం జరిగిందని తహసీల్దార్‌ సదానందం చెప్పారు.