మంగళవారం 01 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Sep 25, 2020 , 02:28:05

శభాష్‌ పోలీస్‌

శభాష్‌ పోలీస్‌

  •  n  ప్రమాదానికి గురై ఆత్మైస్థెర్యం కోల్పోతున్న    బాధిత కుటుంబానికి ఆసరా
  •  n  కిరాణా దుకాణం పెట్టించి ఉపాధి చూపిన     సీఐ  వెంకటేశ్‌

వేములవాడ: పెయింటర్‌గా పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్న తరుణంలో ప్రమాదానికి గురై ఆత్మైస్థెర్యం, మనైస్థెర్యం కోల్పోతున్న ఓ కుటుంబానికి పోలీసులు అండగా నిలిచారు. నేరస్థుల పాలిట కర్కషంగా వ్యవహరించే పోలీసులు ఆపదలో ఉన్న వారికి బాసటగా నిలుస్తుండడంపై పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ శభాష్‌ పోలీస్‌ అంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని భగవంతరావునగర్‌లో మహమ్మద్‌ ఇక్బాల్‌ పెయింటర్‌గా పనిచేసేవాడు. మూడేళ్ల కిందట పని ముగించుకొని వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి మనైస్థెర్యం కోల్పోయాడు. విచిత్రంగా ప్రవర్తించేవాడు. ఆత్మహత్య చేసుకునేందుకు ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నించాడు. ఈ నెల 21వ తేదీన కూడా మూలవాగులో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా విషయం తెలుసుకున్న పట్టణ సీఐ వెంకటేశ్‌ కాపాడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఇక్బాల్‌కు భార్య సోనితోపాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆత్మైస్థెర్యంతో అన్నింటిని ఎదుర్కొని కుటుంబానికి అండగా ఉండాలని ఇక్బాల్‌కు సీఐ హితబోధ చేశారు. ఉపాధికోసం అవసరమైన పనిలో పెట్టిస్తానని సీఐ వారికి హామీ ఇవ్వడంతో కిరాణ దుకాణం పెట్టుకునేందుకు తాము ముందుకు వచ్చారు. సీఐ వెంకటేశ్‌ దాదాపు 10వేల రూపాయల విలువైన కిరాణా సామగ్రిని కొనుగోలు చేసి, గురువారం కిరాణం దుకాణాన్ని పెట్టించి ఉపాధిబాట చూపారు.