బుధవారం 28 అక్టోబర్ 2020
Rajanna-siricilla - Sep 24, 2020 , 01:38:10

విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి

విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి

  •  ఆర్‌ఐ రజనీకాంత్‌     
  •  పోలీసు వాహన డ్రైవర్లతో సమీక్షా సమావేశం

సిరిసిల్ల క్రైం: విధి నిర్వహణలో పోలీసు వాహన, పెట్రోకారు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని ఆర్‌ఐ రజనీకాంత్‌ సూచించారు. ఎస్పీ రాహుల్‌ హెగ్డే ఆదేశాలతో బుధవారం జిల్లా పోలీసు హెడ్‌ క్వార్టర్స్‌లో పెట్రోకారు డ్రైవర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పోలీసు, పెట్రో వాహనాలను ఇతర పనులకు ఎట్టి పరిస్థితుల్లో వినియోగించవద్దన్నారు. సొంత పనులకు వినియోగిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనం బాధ్యత డ్రైవర్‌దేనని స్పష్టం చేశారు. ట్రాఫిక్‌ నియమాలు పాటించాలని, యూనిఫాం తప్పనిసరిగా ధరించాలని పేర్కొన్నారు. అత్యవసర సమయాల్లో తప్ప అతివేగంతో వెళ్లకూడదన్నారు. డ్రైవర్‌ తప్ప వేరే ఇతర అధికారి వాహనాన్ని నడపరాదన్నారు. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సమావేశంలో జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పెట్రో కారు, వాహన డ్రైవర్లు, అధికారులు పాల్గొన్నారు.logo