గురువారం 29 అక్టోబర్ 2020
Rajanna-siricilla - Sep 24, 2020 , 01:38:14

స్వచ్ఛతకు ప్రతి ఒక్కరూ సహకరించాలి

స్వచ్ఛతకు ప్రతి ఒక్కరూ సహకరించాలి

  • n  సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ
  • n  చంద్రంపేటలో చెత్తబుట్టల పంపిణీ 

సిరిసిల్ల రూరల్‌: సిరిసిల్ల మున్సిపల్‌లో విలీన గ్రామాల స్వచ్ఛతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ పేర్కొన్నారు. 12వ వార్డు పరిధిలోని చంద్రంపేటలో బుధవారం చెత్త బుట్టల పంపిణీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. విలీన గ్రామాల్లో స్వచ్ఛత కోసం మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో మున్సిపల్‌ నిధులు రూ.6 లక్షలతో పది వేల చెత్త బుట్టలు కొనుగోలు చేశామన్నారు. ప్రతి ఇంటికీ రెండు చొప్పున అందిస్తున్నామని తెలిపారు. విలీన గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇందుకు అందరూ సహకరించాలని, తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్‌ సిబ్బందికి అందించాలని కోరారు. పట్టణంలో మాదిరిగానే విలీన గ్రామాల్లోనూ చెత్త సేకరణ చేస్తామన్నారు. అలాగే ప్రభుత్వం మరోసారి ఎల్‌ఆర్‌ఎస్‌ అవకాశం కల్పించిందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విలీన గ్రామాల్లోని సమస్యలను మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. అంతకుముందు మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య మాట్లాడుతూ, తడి, పొడి చెత్త బుట్టలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర పనులకు వాటిని వాడవద్దని సూచించారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌ మాట్లాడుతూ, అర్హులందరూ డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. కౌన్సిలర్‌ పాతూరు రాజిరెడ్డి మాట్లాడుతూ, విలీన గ్రామమైన చంద్రంపేటలో చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమం మొదట ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌తోపాటు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ, మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, వైస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ పాతూరి రాజిరెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ వెంకటరమణ, టౌన్‌ ప్లానింగ్‌ అధికారి అన్సారీ, ఎన్విరాన్‌మెంట్‌ ఇంజినీర్‌ రఘు, మాజీ సర్పంచ్‌ పులి శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ వార్డు అధ్యక్షుడు వీరగోని శ్రీనివాస్‌గౌడ్‌, మాజీ ఉప సర్పంచ్‌ అబ్బగోని శ్రీనివాస్‌గౌడ్‌, నాయకులు కంది భాస్కర్‌రెడ్డి, నర్సయ్య వార్డు ప్రజలు పాల్గొన్నారు.


logo