శనివారం 28 నవంబర్ 2020
Rajanna-siricilla - Sep 23, 2020 , 01:56:34

కర్షకోత్సాహం

కర్షకోత్సాహం

  •  సిరిసిల్ల నియోజకవర్గంలో నూతన రెవెన్యూ చట్టానికి మద్దతు 
  •  ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో 98 గ్రామాల్లో ర్యాలీలు
  •  ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ చిత్రపటాలకు పాలాభిషేకాలు
  •  దశాబ్దాల కష్టాలను దూరం చేశారంటూ ధన్యవాదాలు

రాజన్న సిరిసిల్ల, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త రెవెన్యూ చట్టానికి కృతజ్ఞతగా మంగళవారం సిరిసిల్ల నియోజకవర్గంలోని రైతులంతా పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు, ఎడ్లబండతో ర్యాలీలు తీశారు. ఐదు మండలాలు, 98గ్రామాల్లో 2వేల మంది రైతులు, 1800 ట్రాక్టర్లు, ఎండ్లబండ్లతో ప్రదర్శనలు నిర్వహించారు. దశాబ్దాల కాలంగా పడుతున్న కష్టాలను తీర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేసి, రుణపడి ఉంటామంటూ ధన్యవాదాలు తెలిపారు. తంగళ్లపల్లి మండంలోని 30 గ్రామాల్లో 500మంది రైతులు ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో ర్యాలీలు తీస్తూ సంబురాలు జరుపుకున్నారు. గంభీరావుపేట మండలంలోని 21గ్రామాల్లో 255 ట్రాక్టర్లతో 400 మంది రైతులు, 200మంది నాయకులు ర్యాలీ తీశారు. గంభీరావుపేట మం డల కేంద్రంలోని అన్ని వీధులగుండా జడ్పీటీసీ కొమిరెట్టి విజయ, ఎంపీపీ వంగ కరుణ సారథ్యం లో తహసీల్దార్‌ కార్యాలయం వరకు చేపట్టారు. సముద్రాలింగాపూర్‌, సింగసము ద్రం చెరువు వద్ద సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ చిత్రపటాలకు పలువురు రైతులు పాలాభిషేకం చేశారు. ఎల్లారెడ్డిపేట మండలకేంద్రంతో పాటు 19 గ్రామాల్లో ర్యాలీ చేపట్టారు. వీర్నపల్లి మండలంలో 80ట్రాక్టర్లతో నిర్వహించిన ర్యాలీలో సుమా రు 200మంది రైతులు పాల్గొన్నారు. ముస్తాబాద్‌ మండలంలోని 22 గ్రామాల్లో వివిధ వర్గాల ప్రజలు డప్పుచపుళ్ల నడుమ ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. రెవెన్యూ సమస్యలతో దశాబ్దాలుగా ఎదుర్కొన్న ఇబ్బందులు ఈ చట్టంతో తొలగిపోతాయని వారు సంతోషం వ్యక్తం చేశారు.