మంగళవారం 20 అక్టోబర్ 2020
Rajanna-siricilla - Sep 22, 2020 , 02:14:39

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

  •  జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ 
  •  అధికారులతో సమీక్ష

రాజన్న సిరిసిల్ల, నమస్తే తెలంగాణ: అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసి జిల్లాను అగ్రభాగాన నిలుపాలని జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ అన్నారు. జిల్లా పరిషత్‌ కార్యాలయంలో సోమవారం వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ప్రగతిలో ఉన్న రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, కంపోస్టుషెడ్లు, వైకుంఠధామాలను వెంటనే పూర్తి చేయాలన్నారు. అభివృద్ధి పనుల్లో అధికారులు అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, డిప్యూటీ సీఈవో నాగలక్ష్మి, డీపీవో రవీందర్‌, డీఆర్డీవో కౌటిల్యారెడ్డి, డీఈఈ శ్రీనివాసరావు, మండలాభివృద్ధి అధికారులు పాల్గొన్నారు. 

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేత

కోనరావుపేట: ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని జడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కనగర్తి గ్రామానికి చెందిన కాసర్ల నర్సయ్యకు రూ.20 వేలు, జాప భీరయ్యకు రూ. 24వేలు, శివంగాళపల్లికి చెందిన పోచయ్యకు రూ. 20వేలు, నిమ్మపల్లికి చెందిన సీహెచ్‌ లక్ష్మికి రూ. 12వేల విలువైన చెక్కులు మంజూరు కాగా, జిల్లా పరిషత్‌ కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా జడ్పీ అధ్యక్షురాలు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా పేదల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం చెక్కుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే రమేశ్‌బాబు, జడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణకు లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీటీసీ లింగంపల్లి లక్ష్మి, సింగిల్‌ విండో వైస్‌ చైర్మన్‌ అనుపాటి భూంరెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షుడు న్యాలకొండ రాఘవరెడ్డి, మాజీ సర్పంచ్‌ బాపురెడ్డి పాల్గ్గొన్నారు.


logo