బుధవారం 28 అక్టోబర్ 2020
Rajanna-siricilla - Sep 21, 2020 , 02:50:17

కూలీకి వెళ్లి.. సెల్‌ ఫోన్‌ కొనుక్కొని..

కూలీకి వెళ్లి.. సెల్‌ ఫోన్‌ కొనుక్కొని..

ఎల్లారెడ్డిపేట: ఆ యువతిది నిరుపేద కుటుం బం.. చదువులో మాత్రం ఉన్నతంగా రాణిస్తోం ది. అయితే ఆన్‌లైన్‌ పాఠాలు వినేందుకు సెల్‌ఫోన్‌ లేకపోవడంతో ఎలాగైనా కొనుక్కోవాలని కూలీగా మారింది. నెలరోజుల పాటు కూలీ పనులకు వెళ్లి మొబైల్‌ సంపాదించింది. ఆదర్శంగా నిలుస్తున్న ఆ యువతికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఎల్లారెడ్డిపేట మండలం సింగారం మాజీ సర్పంచ్‌ చాకలి రజిత-రాములు దంపతుల పెద్ద కూతురు దివ్య జగిత్యాలలో టీఎస్‌డబ్ల్యూ డీసీలో బీఎస్సీ (ఫుడ్‌సైన్స్‌) కోర్సులో చేరింది. ఆన్‌లైన్‌ క్లాసులు విందామంటే తన వద్ద ల్యాప్‌టాప్‌ గానీ, ఫోన్‌గానీ లేదు. తల్లి చాకలి రజిత 2006-12 మధ్య సర్పంచ్‌గా పనిచేసినా, ప్రజా సేవకే అంకితమైం ది. ఇం ట్లో పేదరికాన్ని కండ్లనిండా చూస్తున్న రజిత తల్లిదండ్రులను ఏమీ అడగలేక నెలరోజులపాటు కూలీ పనులకు వెళ్లి ఓ మొబైల్‌ ఫోన్‌ కొనుక్కుంది. సమయం దొరికినప్పుడల్లా చేను పనులకు వెళ్తూ ఆన్‌లైన్‌ క్లాసులు వింటున్నది.


logo