ఆదివారం 25 అక్టోబర్ 2020
Rajanna-siricilla - Sep 21, 2020 , 02:26:42

ఎల్‌ఆర్‌ఎస్‌ సద్వినియోగం చేసుకోవాలి

ఎల్‌ఆర్‌ఎస్‌ సద్వినియోగం చేసుకోవాలి

రాజన్న సిరిసిల్ల, నమస్తేతెలంగాణ:  అనధికార ప్లా ట్లు, అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మంచి అవకాశం కల్పించిందని జిల్లా పంచాయతీ అధికారి యెనగందుల రవీందర్‌ పేర్కొన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ జీవోలో సవరణతో ఫీజులు తగ్గి పేదలకు మరిం త మేలు జరుగుతున్నందున అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం ఇటీవల తీసుకు వచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి ‘నమస్తే తెలంగా ణ’ ఇంటర్వ్యూలో ఆయన పలు వివరాలు వెల్లడించా రు. జిల్లాలోని లే అవుట్ల పరిస్థితిపై వివరించారు. 

నమస్తే: జిల్లాలో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో అనధికార లే అవుట్లు ఎన్ని గుర్తించారు?

డీపీవో: జిల్లాలోని 13 మండలాల్లో మొత్తం 255 పంచాయతీలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 335 అన ధికార లే అవుట్లు ఉన్నాయి. ఇందులో 16,594 ప్లాట్లు ఉన్నట్లు గుర్తించాం. వీటికి టౌన్‌అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ (డీటీసీపీ), గ్రామ పంచాయతీ నుంచి అను మతులు తీసుకోలేదు. 13 మండలాల్లో తంగళ్లపల్లి మండలంలోని పద్మనగర్‌ గ్రామ పంచాయతీ పరిధిలో ఒకే ఒక్క లే అవుట్‌కు అనుమతి ఉంది. మిగిలిన వాటికి అనుమతులు లేవు. 

 చట్టవిరుద్ధమైన లే అవుట్లపై ఎలాంటి చర్యలు ఉంటాయి?

డీపీవో: టౌన్‌ కంట్రీ ప్లానింగ్‌ అధికారులు (డీటీసీ పీ), గ్రామ పంచాయతీ అనుమతి తీసుకున్న ప్లాట్లకు అన్ని పర్మిషన్లు లభిస్తాయి. అనుమతి లేని వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం పంచాయతీ లకు ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం అక్రమ లే అవుట్లను క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించింది. ఇది చక్కని అవకాశం సద్వినియోగం చేసుకుంటే మంచిది. 

క్రమబద్ధీకరించడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటి?

డీపీవో:  రెగ్యులరైజేషన్‌ వల్ల చాలా లాభాలు న్నాయి. క్రమబద్ధీకరించుకున్న ప్లాట్లలో ఇల్లు కట్టుకునే వారు అనుమతులు వెంటనే పొందే అవకాశం ఉం టుంది. రోడ్లు, మంచినీరు, వీధి లైట్లు, ఇతర మౌలిక సౌకర్యాలు పొందవచ్చు.

అక్రమ లే అవుట్లలో యజమానులు 

ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు ?

డీపీవో: భవన నిర్మాణాలకు అనుమతులు లభిం చవు. రిజిస్ట్రేషన్‌ చేయలేరు. ప్లాట్లలో ఇళ్లు కట్టుకోవా లన్నా కనీసం బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వవు. అమ్మడం, కొనడం సాధ్యం కాదు. ఇలాంటి ప్లాట్లు ఎంతకాలం ఉన్నా ఇబ్బందులు తప్పవు. 

అన్ని పంచాయతీలకు క్రమబద్ధీకరణ వర్తిస్తుందా ?

డీపీవో: రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో ఈ క్రమబద్దీకరణ పథకం ప్రవేశపెట్టింది. మున్సిపాలిటీల కే కాకుండా అన్ని పంచాయతీలకు వర్తింపజేసింది. టౌ న్‌ప్లానింగ్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ డైరెక్టర్‌ సాంకేతిక అనుమతి లేకుండా పంచాయతీ ఆమో దించిన లే అవుట్‌ చెల్లుబాటు కాదు.

అనధికార ప్లాట్‌ను కొనుగోలు చేస్తే 

క్రమబద్ధీకరించుకోవచ్చా ?

డీపీవో: అమ్మకపు దస్తావేజుతోపాటు దరఖాస్తుకు లోబడి క్రమబద్ధీకరించబడుతుంది. డీటీసీపీ, గ్రామ పంచాయతీ నుంచి అనుమతులు తీసుకున్న తర్వాత అందులో యజమాని కొన్ని మార్పులు చేయకపోతే ప్లాట్లు చెల్లుబాటు కావు. కాగా కమ్యూనిటీ కోసం వదిలిన బహిరంగ ప్రదేశాన్ని విక్రయిస్తే ఆ స్థలం క్రమబద్ధీకరించుకునే అవకాశం లేదు. 

రుసుం ఎప్పటిలోగా చెల్లించాలి. అనధికార భవనాలు క్రమబద్ధీకరించుకోవచ్చా?

డీపీవో: క్రమబద్ధీకరణ కోసం రుసుం 31-01-2021 వరకు వాయిదాల పద్ధతిలో చెల్లించవచ్చు. ప్రస్తుతం ప్లాట్లను మాత్రమే రెగ్యులరైజేషన్‌ చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం కల్పించిన ఎల్‌ఎ ర్‌ఎస్‌ను అందరూ వినియోగించుకోవాలి.logo