ఆదివారం 29 నవంబర్ 2020
Rajanna-siricilla - Sep 20, 2020 , 03:02:07

ప్రకృతి వనాలతో నందనవనంలా పల్లెలు

ప్రకృతి వనాలతో నందనవనంలా పల్లెలు

సిరిసిల్ల రూరల్‌: పల్లె ప్రకృతి వనాలతో పల్లెలన్నీ నందనవనంలా మారుతున్నాయని జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మాట్ల మధు అన్నారు. ఈ మేరకు తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో శనివారం పల్లె ప్రకృతి వనానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ప్రజాప్రతినిధులు, గ్రామస్తుల సమక్షంలో హద్దులు ఏర్పాటు చేసి, పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు చెన్నమనేని వెంకట్రావు, నేరెళ్ల సింగిల్‌విండో చైర్మన్‌ కొడూరి భాస్కర్‌గౌడ్‌, ఉపసర్పంచ్‌ సతీశ్‌రెడ్డి, నాయకులు పూసపల్లి రామచంద్రం, శ్రీనివాస్‌, రమేశ్‌, గుండెల్లి కిరణ్‌, ఎర్ర కృష్ణ, నర్సయ్య, కార్యదర్శి లిథియా, మల్లమారి ప్రభాకర్‌, పూర్ణ, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.