ఆదివారం 25 అక్టోబర్ 2020
Rajanna-siricilla - Sep 19, 2020 , 02:20:47

టీఆర్‌ఎస్‌తోనే న్యాయం

టీఆర్‌ఎస్‌తోనే న్యాయం

  •  జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ
  •  మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీ

వీణవంక : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ పేర్కొన్నారు.  ప్రభుత్వం అందజేసిన చేప పిల్లలను మండల కేంద్రంలోని చెక్‌డ్యాం సమీపంలో శుక్రవారం కనుమల్ల విజయ, ఎంపీపీ ముసిపట్ల రేణుకతో కలిసి మత్స్యకారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుతో నీటి వనరులు భారీగా  పెరిగాయని వివరించారు.  వీటిలో చేపలు పెంచడంతో మత్స్యకారులకు జీవనోపాధి దొరికిందని తెలిపారు. మిషన్‌కాకతీయ ద్వారా గ్రామాల్లో చెరువులు, కుంటలు బాగయ్యాయని స్పష్టం చేశారు. అనంతరం శ్రీరాములపేటలో నిర్మించిన సెగ్రిగేషన్‌ షెడ్‌ను ప్రారంభించారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌  కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ మాజీ చైర్మన్‌ పోలు లక్ష్మణ్‌, జిల్లా అధికారి ఖదీర్‌ అహ్మద్‌, వైస్‌ ఎంపీపీ రాయిశెట్టి లత, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ మాడ సాదవరెడ్డి, సర్పంచ్‌ కొల్లూరి సంధ్యారాణి, ఎంపీటీసీ సంగ స్వరూప, టీఆర్‌ఎస్‌ పార్టీ నేత కొమురయ్య, నాయకులు ముసిపట్ల తిరుపతిరెడ్డి, రాయిశెట్టి శ్రీనివాస్‌, మోటం వెంకటేశ్‌, విష్ణు, సంపత్‌, కొల్లూరి బాబురావు, సమ్మయ్య, నందయ్య, దాసారపు రాజు, కాంతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.logo