గురువారం 29 అక్టోబర్ 2020
Rajanna-siricilla - Sep 19, 2020 , 02:20:49

అక్కాతమ్ముళ్లకు అండగా..

అక్కాతమ్ముళ్లకు అండగా..

  • ఎమ్మెల్యే సుంకె 90 వేల ఆర్థికసాయం n పిల్లల చదువులకు సహకరిస్తానని హామీ

రామడుగు: తల్లిదండ్రులు, కంటికి రెప్పలా కాపాడిన నాన మ్మను కోల్పోయి అనాథలుగా మిగిలిన అక్కాతమ్ముళ్లకు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ అండగా నిలిచారు. తాను ప్రకటించిన దానికంటే అధికంగా ఆర్థిక సాయం చేయ డంతోపాటు చదువుల కోసం సహకరిస్తానని మానవత్వం చాటుకున్నారు. రుద్రారం గ్రామానికి చెందిన గుర్రం నవిత, నవీన్‌కుమార్‌ తండ్రి ఐదేండ్ల క్రితం, తల్లి రెండేండ్ల క్రితం మృతి చెందడంతో నానమ్మ సత్తమ్మ వీరిని కూలీనాలీ చేసుకుం టూ పోషించింది. ఈ నెల 14న ఆమె కూడా వృద్ధాప్యంతో మరణించడంతో చిన్నారులు అనాథలైన విషయం తెలిసిందే.. కాగా, శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ గ్రామా నికి చేరుకుని అనాథ పిల్లలను పరామర్శించి అండగా నిలుస్తా నని హామీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమ యంలో తనకు విషయం తెలియగా 25వేలు ప్రకటించాన ని, అయితే చిన్నారుల దీనస్థితి చూసిన తరువాత చలించి 90వేలు అందిస్తున్నట్లు చెప్పారు. దుబాయి ఎల్లాల శ్రీనన్న సేవాసమితి మీడియా కోఆర్డినేటర్‌, రంగశాయిపల్లికి చెందిన చిలుముల రమేశ్‌ దుబాయి నుంచి పంపిన 10వేలు, టీఆర్‌ ఎస్‌ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డి అందించిన 5వేల తో కలిపి మొత్తం లక్షా ఐదు వేలు చిన్నారులకు అందించా రు. దాతలు ముందుకువచ్చి ఆదుకోవాలని కోరారు. నవిత పదో తరగతి పూర్తి కాగా, ఇంటర్‌, డిగ్రీ, ఆ పైచదువులకు సహ కారం అందిస్తానని హామీఇచ్చారు. నవీన్‌కుమార్‌ను ప్రైవేట్‌ లేదా ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలలో చదివిస్తామన్నారు. కొద్దిరోజుల క్రితం చొప్పదండి మండలం కాట్నపెల్లిలో ఇలాం టి ఘటన జరిగితే వారికి అండగా నిలిచి సుమారు 10నుంచి 15లక్షల వరకు దాతలు సాయం అందించారని, గంగాధర మండలం ర్యాలపల్లిలోనూ అనాథ పిల్లలకు 8లక్షల వరకు సాయం అందించారని గుర్తుచేశారు. ఇందులో రామడుగు, చొప్పదండి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్లు గంట్ల వెం కటరెడ్డి, ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్‌, ఆర్‌బీఎస్‌ మండల కన్వీనర్‌ జూపాక కరుణాకర్‌, సర్పంచ్‌ వొంటెల అమరేందర్‌రెడ్డి, ఎంపీటీసీ గుర్రం దేవిక, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, సర్పంచు లు, టీఆర్‌ఎస్‌ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.