మంగళవారం 27 అక్టోబర్ 2020
Rajanna-siricilla - Sep 17, 2020 , 02:52:37

సమస్యల ప్రస్తావనపై సర్వత్రా హర్షం

సమస్యల ప్రస్తావనపై సర్వత్రా హర్షం

  •  ముఖ్యమంత్రి కేసీఆర్‌,   ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ చిత్రపటాలకు పాలాభిషేకం

గంగాధర: పరిపాలన సౌలభ్యం కోసం గంగాధర మండలం గర్శకుర్తి, బూరుగుపల్లిని మండల కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించడంపై ఆయా గ్రామాల నాయకులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గర్శకుర్తిలో సర్పంచ్‌ అలువాల నాగలక్ష్మి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గర్శకుర్తిని మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తే చుట్టు పక్కల గ్రామాలకు సౌకర్యవంతంగా ఉంటుందని సర్పంచ్‌ తెలిపారు. గర్శకుర్తిని మండల కేంద్రం ఏర్పాటు చేయాలని కోరిన ఎమ్మెల్యే రవిశంకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అలువాల తిరుపతి, కల్వకోట శ్రీనివాసరావు, కట్ట శ్రీనివాస్‌, గోనెపెల్లి మహేందర్‌, పల్ల మల్లిక్‌, మామిడిపెల్లి అఖిల్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.

బూరుగుపల్లి వాసుల హర్షం

బూరుగుపల్లిని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ అసెంబ్లీలో ప్రస్తావించడంపై గంగాధర మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సాగి మహిపాల్‌రావు, సర్పంచ్‌ సాగి రమ్య హర్షం వ్యక్తం చేశారు. గంగాధర, రామడుగు, పెగడపల్లి మండలాల్లోని పలు గ్రామాలకు బూరుగుపల్లి ముఖ్య కేంద్రంగా ఉందని, ఆయా గ్రామాల ప్రజలు వివిధ పనుల నిమిత్తం ఇక్కడికి వస్తుంటారని తెలిపారు. బూరుగుపల్లిని మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తే ఆయా గ్రామాల ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. బూరుగుపల్లిని మండల కేంద్రంగా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే రవిశంకర్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

గంగాధర: మండలంలోని లక్ష్మీదేవిపల్లి వద్ద వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, గర్శకుర్తి, బూరుగుపల్లిని మండల కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ ప్రస్తావించడంపై టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు  ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. మండల అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే రవిశంకర్‌కు టీఆర్‌ఎస్‌ శ్రేణులు, ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.

రామడుగు: గోపాల్‌రావుపేటను మండల కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ అసెంబ్లీలో ప్రస్తావించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు ఎడవెల్లి నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేతో పాటు సీఎం కేసీఆర్‌, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ గోపాల్‌రావుపేట జనాభా 2011 లెక్కల ప్రకారం ఆరువేలకుపైగా ఉంటుందన్నారు.  మండల కేంద్రం ఏర్పాటుపై అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, సీఎం కేసీఆర్‌కు గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. మండల కోఆప్షన్‌ సభ్యుడు రజబ్‌ అలీ, టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు దాసరి బాబు, నాయకులు ఎడవెల్లి పాపిరెడ్డి, పూడూరి మల్లేశం, అంజయ్య, ముదుగంటి రాజిరెడ్డి, మల్లేశం, కమలాకర్‌, శ్యాంసుందర్‌రెడ్డి, రమేశ్‌, ఆనందంరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.


logo