శుక్రవారం 30 అక్టోబర్ 2020
Rajanna-siricilla - Sep 17, 2020 , 02:52:37

నేడు ఎంగిలిపూల బతుకమ్మ

నేడు ఎంగిలిపూల బతుకమ్మ

  • తిరిగి అక్టోబర్‌ 17 నుంచి వేడుకలు  lరాజన్న ఆలయ స్థానాచార్యులు భీమాశంకర్‌

వేములవాడ కల్చరల్‌: ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను గురువారం జరుపుకోవాలని రాజన్న ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్‌ వెల్లడించారు. ఈ యేడు అధిక మాసం (ఆశ్వీయుజ) రావడంతో కొంత సందిగ్ధత నెలకొన్నదని చెప్పారు. బుధవారం పండుగకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. పిత్రు అమావాస్య రోజున   ఎంగిలిపూల బతుకమ్మను పేర్చి తిరిగి అక్టోబర్‌ 17వ తేదీ నుంచి బతుకమ్మ సంబురాలు జరుపుకోవాలని సూచించారు. వేములవాడలో ఏడు రోజులు, ఇతర ప్రాంతాల్లో తొమ్మిది రోజుల పాటు జరుపుకోవాలన్నారు. 24న సద్దుల బతుకమ్మ, 25న ఆదివారం విజయదశిమిని ఘనంగా చేసుకోవాలని కోరారు. ప్రతి 19 సంవత్సరాలకోసారి అధిక మాసం వస్తుందని పేర్కొన్నారు. కాగా కొవిడ్‌ నేపథ్యంలో వేములవాడలో ఈ యేడు బతుకమ్మ సంబురాలు సాదాసీదాగా జరిగే అవకాశాలుంటాయని పలువురు చెబుతున్నారు.