శుక్రవారం 30 అక్టోబర్ 2020
Rajanna-siricilla - Sep 15, 2020 , 02:59:30

తల్లిదండ్రుల బాధ్యత పిల్లలదే

తల్లిదండ్రుల బాధ్యత పిల్లలదే

  • ఆర్డీవో ఆనంద్‌కుమార్‌

గంగాధర : వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పోషించవలసిన బాధ్యత వారి పిల్లలదేనని ఆర్డీవో ఆనంద్‌కుమార్‌ స్పష్టం చేశారు. మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన ఇరుగురాల నర్సయ్య, శంకరమ్మను కన్న కూతురే ఇంటి నుంచి గెంటివేసిన కథనం ఇటీవల నమస్తే తెలంగాణలో ప్రచురితమైం ది. ఇదివరకే అధికారులు స్పందించి ఆ వృద్ధ జంటను ఇంటి వద్దకు పంపి వారి కూతురుకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. సోమవారం ఆర్డీవో ఆనంద్‌కుమార్‌ లక్ష్మీదేవిపల్లికి వచ్చి నర్స య్య, శంకరమ్మ, కూతురు మహేశ్వరికి మరోమారు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. చట్ట ప్రకారం తల్లిదండ్రులను వారి పిల్లలే పోషించాలని, లేక పోతే వారి నుంచి సంక్రమించిన ఆస్తి రిజిస్ట్రేషన్‌ రద్దు చేయడానికి అవకాశం ఉందన్నారు. తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఆర్‌ఐ అశోక్‌ తదితరులు ఉన్నారు.