మంగళవారం 24 నవంబర్ 2020
Rajanna-siricilla - Sep 14, 2020 , 03:28:31

పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకం

పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకం

సిరిసిల్ల టౌన్‌: స్వచ్ఛ సిరిసిల్ల నిర్మాణంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకమని మున్సిపల్‌ అధ్యక్షురాలు జిందం కళ పేర్కొన్నారు. మున్సిపల్‌ డంప్‌యార్డులో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను జిల్లా కేంద్రంలోని పొదుపు భవన్‌లో ఆదివారం సన్మానించారు. ఈ సందర్భంగా ఐటీసీ కోఆర్డినేటర్‌ అన్నారపు ప్రశాంత్‌తోపాటు సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా జిందం కళ మాట్లాడుతూ, సిరిసిల్ల మున్సిపాలిటీని స్వచ్ఛతలో దేశానికే ఆదర్శంగా నిలుపాలన్న మంత్రి కేటీఆర్‌ ఆశయానికి అనుగుణంగా మున్సిపల్‌ పాలకవర్గం పని చేస్తున్నదన్నారు. పట్టణంలోని ప్రతి ఇంటి నుంచి సేకరించిన చెత్తను డంప్‌యార్డులో తడి, పొడిగా వేరు చేసి మున్సిపల్‌కు ఆదాయాన్ని అందిస్తున్న కార్మికుల పని తీరు అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో కమిషనర్‌ సమ్మయ్య, వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.